Friday, April 26, 2024

పవన్ సినిమాలో బాలీవుడ్ విలన్..

తప్పక చదవండి

పవన్‌ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో తెగ బిజీ అయిపోయాడు. వారానికో సెట్‌లో దర్శనమిస్తూ చక చక షూటింగ్‌లను కంప్లీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్‌ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ఇక పవర్‌ స్టార్‌ లైనప్‌లో అందరినీ ఎగ్‌జైట్‌మెంట్‌కు గురి చేస్తున్న ప్రాజెక్ట్‌ ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఒక్క ప్రీలుక్‌ పోస్టర్‌తోనే సోషల్‌ మీడియా షేక్‌ అయిందంటే.. ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అనే ఊహే గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. పైగా ఈ సినిమాలో పవన్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపిస్తున్నాడు. అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు పవన్‌ ‘పంజా’లో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించాడు. మళ్లీ ఇనేళ్ల తర్వాత గ్యాంగ్‌స్టర్‌ పాత్ర చేస్తుండటంతో సినిమాపై ఎక్కడలేని హైప్‌ క్రియేట్‌ అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఈ సినిమాలో హీరో పాత్రకు ఎంత ఇంపార్టెన్స్‌ ఉందో.. విలన్‌ పాత్రకు కూడా అంతే స్కోప్‌ ఉందట. దాంతో ఆ పాత్ర కోసం బాలీవుడ్‌ హీరోను ఎంపిక చేసే పనిలో పడ్డారట మేకర్స్. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ వార్తతో సినిమా భారీ రేంజ్‌లో ఉండబోతుందని తెలుస్తుంది.

యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి ఇండస్ట్రీ హిట్‌ను నిర్మించిన దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కోసం పవన్‌ 60రోజుల కాల్షీట్లు ఇచ్చాడని తెలుస్తుంది. ఇక ఈ ఏడాది చివరి కల్లా టాకీ పార్ట్‌ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలిని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు