Monday, May 6, 2024

త‌మిళ‌నాడులో ఏనుగు బీభ‌త్సం..

తప్పక చదవండి

త‌మిళ‌నాడులో ఓ గ‌జ‌రాజు హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అరికంబ‌న్ అనే ఏనుగు .. క‌మ్‌బ‌మ్ ప‌ట్ట‌ణంలోకి ప్ర‌వేశించింది. ఇడుకుడిలోని చిన్న‌కెనాల్ నుంచి అది పెరియార్ టైగ‌ర్ రిజర్వ్ ఫారెస్టులోకి ప్ర‌వేశించింది. క‌మ్‌బ‌మ్ ప‌ట్ట‌ణంలోకి ప్ర‌వేశించిన ఆ ఏనుగు.. ఇండ్ల మ‌ధ్య ప‌రుగులు తీసింది. దీంతో స్థానిక ప్ర‌జ‌లు భయాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో వైర‌ల్ అయ్యింది. ఏనుగు నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. అందులో ఒక‌రి ప‌రిస్థితి క్రిటిక‌ల్‌గా ఉంది. ప‌ట్ట‌ణంలోకి ప్ర‌వేశించిన గ‌జ‌రాజు.. అనేక ఆటోరిక్షాలు, టూవీల‌ర్ల‌ను ధ్వంసం చేసింది. కొబ్బ‌రితోట‌లు ఉన్న క‌మ్‌బ‌మ్ ప్రాంతంలోకి అది ప్ర‌వేశించిన‌ట్లు అనుమానిస్తున్నారు.

ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులోని క‌మ్‌బ‌మ్ ప్రాంతంలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఆ ఏనుగుకు మ‌త్తు ఇవ్వాల‌ని ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం కుమిలీ ప్రాంతంలో తిరిగిన ఆ ఏనుగు ఇప్పుడు క‌మ్‌బ‌మ్ పట్ట‌ణంలో క‌నిపించింది. ఏనుగుకు ఉన్న రేడియో కాల‌ర్ ద్వారా దాని క‌ద‌లిక‌ల‌ను ప‌సిక‌డుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు