Sunday, May 5, 2024

మూడో జాబితాను ప్రకటించిన బీజేపీ పార్టీ..

తప్పక చదవండి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 35 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. ఇప్పటికే రెండు జాబితాలను కమలం పార్టీ వెల్లడిరచింది. థర్డ్‌ లిస్టులో కూడా బండారు దత్తాత్రేయ కుమార్తెకు మొండి చెయ్యి ఎదురైంది. అలాగే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, నాంపల్లి, కంటోన్మెంట్‌, మల్కాజ్‌గిరి స్థానాలను బీజేపీ నాయకత్వం పెండిరగ్‌లో పెట్టింది. జనసేనకు కూడా కొన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తం 119 స్థానాలకుగాను మాడు విడతలుగా 88 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. అందులో బీసీలకు 33 స్థానాలు, వెలమ ఆరు స్థానాలు, రెడ్డిలకు -24, ఎస్టీ -09, ఎస్సీలకు-13 బ్రాహ్మణలకు ఒకటి, వైశ్యా ఒకటి, నార్త్‌ ఇండియన్‌ అగర్వాల్‌కు ఒక సీటు కేటాయించారు. జనసేనతో పొత్తులు కుదిరిన తర్వాత మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు.

- Advertisement -

బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా..
బోధన్‌ – వడ్డి మోహన్‌రెడ్డి, మంచిర్యాల- వీరబెల్లి రఘునాథ్‌, ఆసిఫాబాద్‌ (ఎస్టీ) – అజ్మీరా ఆత్మారాం నాయక్‌, బాన్సువాడ – యెండల లక్ష్మీనారాయణ, నిజామాబాద్‌ రూరల్‌ – దినేశ్‌ కులాచారి, మంథని – చందుపట్ల సునీల్‌రెడ్డి, అందోల్‌ (ఎస్సీ)- పల్లి బాబూమోహన్‌, జహీరాబాద్‌ (ఎస్సీ) – రామచంద్ర రాజ నరసింహా, మెదక్‌ – పంజా విజయ్‌కుమార్‌, నారాయణ్‌ఖేడ్‌ – జనవాడె సంగప్ప, ఉప్పల్‌ – ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, ఎల్బీనగర్‌ – సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్‌ – తోకల శ్రీనివాస్‌రెడ్డి, మలక్‌పేట్‌ – శ్యామ్‌రెడ్డి సురేందర్‌రెడ్డి, అంబర్‌పేట – కృష్ణ యాదవ్‌, జూబ్లీహిల్స్‌ – లంకల దీపక్‌ రెడ్డి, సనత్‌నగర్‌ – మర్రి శశిధర్‌రెడ్డి, సికింద్రాబాద్‌ – మేకల సారంగపాణి, చేవెళ్ల (ఎస్సీ) – కేఎస్‌ రత్నం, పరిగి – బోనేటి మారుతి కిరణ్‌, ముషీరాబాద్‌ – పోస రాజు
పరకాల – కాలి ప్రసాద్‌రావు, పినపాక (ఎస్టీ) – పొడియం బాలరాజు, పాలేరు – నున్న రవికుమార్‌, సత్తుపల్లి (ఎస్సీ)- రామలింగేశ్వరరావు, నారాయణ్‌పేట్‌ – రతంగ్‌ పాండురెడ్డి, జడ్చర్ల – చిత్తరంజన్‌ దాస్‌, మక్తల్‌ – జలంధర్‌రెడ్డి, వనపర్తి – అశ్వత్థామరెడ్డి, అచ్చంపేట (ఎస్సీ)- దేవని సతీశ్‌ మాదిగ, షాద్‌నగర్‌ – అండె బాబయ్య, దేవరకొండ (ఎస్టీ)- కేతావత్‌ లాలూ నాయక్‌, హుజూర్‌నగర్‌ – చల్ల శ్రీలతారెడ్డి, నల్గొండ- మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌, ఆలేరు – పడాల శ్రీనివాస్‌.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు