Wednesday, October 9, 2024
spot_img

బీసీసీఐ భారీగా పన్ను చెల్లింపు

తప్పక చదవండి
  • 1159 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం వెల్లడి
    న్యూఢిల్లీ : ప్రపంచంలోనే బీసీసీఐ అత్యంత సంపన్నమైన క్రికెట్‌ బోర్డు అన్న విషయం తెలిసిందే. అయితే ఆ బోర్డు ప్రతి ఏడాది ఎంత ఆదాయం పన్ను కడుతుందో తెలిస్తే షాక్‌ అవ్వా ల్సిందే. 202122 ఆర్థిక సంవత్సరానికి బీసీసీఐ సుమారు 1159 కోట్ల ఆదాయపన్ను కట్టినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరీ ఈ విషయాన్ని తెలిపారు. బీసీసీఐ ఆదాయపన్ను విషయాలను ఆయన వెల్లడిరచారు. ఆ క్రికెట్‌ బోర్డుకు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు చేశారో వివరించారు. గడిచిన అయిదేళ్లలో ఐటీ రిటర్న్స్‌ చేసిన ఆధారంగా ఈ వివరాలను మంత్రి తెలిపారు. సీసీ ఆదాయంతో పాటు ఐపీఎల్‌ టోర్నీ నుంచి కూడా బీసీసీఐకి రెవన్యూ వస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతమైన లీగ్‌గా ఐపీఎల్‌కు గుర్తింపు వచ్చింది. ఆ లీగ్‌ నుంచే బీసీసీఐకి అధిక మొత్తంలో ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 202021 ఆర్థిక సంవత్సంలో బీసీసీఐ సుమారు 844.92 కోట్ల ఇన్‌కం ట్యాక్స్‌ కట్టింది. ఇక 201920లో 882.29 కోట్లు చెల్లించింది. 202122 సీజన్‌లో బీసీసీఐ సుమారు 7606 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇక ఆ సీజన్‌లో 3064 కోట్లు ఖర్చు చేసింది. 2020`21లో 4735 కోట్లు ఆర్జించగా, సుమారు 3080 కోట్లు ఖర్చు చేసింది బీసీసీఐ.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు