Sunday, May 19, 2024

డబుల్‌ బెడ్రూం నిర్మాణంలో మొదటి స్థానంలో బాన్సువాడ

తప్పక చదవండి
  • నియోజకవర్గంపై పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ
  • 11 వేలకు పైగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను మంజూరు

బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గం 1952 సంవత్సరంలో ఏర్పాటయ్యింది. ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గంలో గట్టి పట్టున్న పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయనకు ఎదురులేకుండా పోయింది. 2011 నుంచి బాన్సువాడ సెగ్మెంట్‌లో గులాబీ జెండా ఎగురుతున్నది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకున్న సాన్నిహిత్యం వల్ల శ్రీనివాసరెడ్డి భారీగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ 11 వేలకు పైగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేయించి నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపారు. కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరోమారు శ్రీనివాస్‌రెడ్డిని విజయతీరాలకు చేర్చనున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొమ్మిదేండ్లలో రూ.10 వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. నిజాంసాగర్‌ నాన్‌ కమాండ్‌ ఏరియా ప్రాంతాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంతో సిద్ధ్దాపూర్‌లో రూ.200 కోట్ల వ్యయంతో మూడు చెరువులను కలిపి రిజర్వాయర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.300 కోట్లతో చందూర్‌, జాకోరా ఎత్తిపోతలను మంజూరు చేసింది. రూ.7 కోట్లతో కల్కి చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా మార్చింది. ఈ చెరువు తీరాన రూ.4 కోట్లతో ఆక్సిజన్‌ పార్కు, చిల్డ్రన్స్‌ పార్కును నిర్మించింది. బాన్సువాడ ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారింది. ఫుడ్‌ సైన్స్‌ టెక్నాలజీ కళాశాల ఏర్పాటయ్యింది. ఎమ్మెల్యే పోచారం చొరవతో నర్సింగ్‌ కాలేజీ, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల, ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ, వృత్తి విద్యా కోర్సు కళాశాలలు, మహిళా కళాశాల, పోస్టు మెట్రిక్‌ వసతి గృహాలు అన్నీ కలిపి సుమారు 30 కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లను మంజూరు చేయించారు. తాజాగా బాన్సువాడ పట్టణంలో రూ. 70 లక్షలతో ఉర్దూ విూడి యం జూనియర్‌ కళాశాల, రూ. 2.5కోట్లతో జూనియర్‌ కళాశాల భవనాలను నిర్మించారు. యువత కోసం రూ.2 కోట్లతో ప్రొఫెసర్‌ జయశంకర్‌ మినీస్టేడియాన్ని నిర్మించారు. బాన్సువాడ దవాఖానలో వసతులు మెరుగుపరిచారు. దాదాపు రూ.100 కోట్లతో ప్రభుత్వ దవాఖానలను ఆధునీకరించి పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ తరహా వైద్య సేవలందిస్తున్నారు. దీంతో బాన్సువాడలోని ఏరియా దవాఖానకు మూడుసార్లు కాయకల్ప, నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్‌ అవార్డు దక్కింది. రూ. 20కోట్ల నిధులతో మరో వంద పడకల మాతాశిశు దవాఖానను అందుబాటులోకి తెచ్చారు. దవాఖానకు బ్రెస్ట్‌ ఫీడిరగ్‌ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్‌ అవార్డుతో గ్రేడ్‌`1 సాధించింది. కోటగిరి మండల కేంద్రంలోని పీహెచ్‌సీని రూ.13 కోట్లతో 50 పడకల దవాఖానగా అప్‌గ్రేడ్‌ చేయించారు. పొతంగల్‌ పీహెచ్‌సీ.. కాయకల్పతోపాటు మరో జాతీయ అవార్డుకు ఎంపికైంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు