Monday, April 29, 2024

ప్రారంభమైనా అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్టాపన పూజ

తప్పక చదవండి
  • పూజలో పాల్గొన్న ప్రధాని మోదీ

అయోధ్యలో ప్రాణప్రతిష్ట పూజా క్రతువులు ప్రారంభమయ్యాయి. బాలరాముడి ప్రాణప్రతిష్టాపన పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోదీతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా పూజలో కూర్చున్నారు. గర్భగుడిలో ఈ కార్యక్రమం జరుగుతోంది. పూజా కార్యక్రమం అనంతరం రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రధాని మోదీ ప్రతిష్టించనున్నారు. ఈ ప్రాణప్రతిష్టకు 84 సెకండ్ల దివ్య ముహూర్తం నిర్ణయించారు. మధ్యాహ్నం 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ఉండే ఈ దివ్య ముహూర్తంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ క్రతువును చేపట్టనున్నారు. ఆ ముహూర్తంలోనే రామ్‌ లల్లా విగ్రహ కళ్లకు ఉన్న కంతల్ని తీసేసి బంగారంతో ప్రత్యేకంగా చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దనున్నారు. అనంతరం రామ్‌ లల్లాకు అద్దాని చూపిస్తారు. ఆ తర్వాత 108 దీపాలతో ‘మహా హారతి’ ఇస్తారు. ఈ మహా హారతితో ప్రాణ ప్రతిష్ట క్రతువు ముగుస్తుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు