Sunday, October 13, 2024
spot_img

ఫ్రాన్స్‌లో దారుణం … స్కూల్‌ టీచర్‌పై కత్తితో దాడి

తప్పక చదవండి

పారిస్‌ : ఫ్రాన్స్‌లోని ఒక స్కూల్‌లో వ్యక్తి రెచ్చిపోయాడు. కత్తితో పలువురిపై దాడి చేశాడు. ఈ సంఘటనలో ఒక ఉపాధ్యాయుడు మరణించగా పలువురు గాయపడ్డారు. ఉత్తర ఫ్రాన్స్‌లోని అరాస్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం గంబెట్టా హైస్కూల్‌లోకి ఒక వ్యక్తి చొరబడ్డాడు. స్కూల్‌ ప్రాంగణంలో ఉన్న టీచర్లు, సెక్యూరిటీ గార్డుపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఒక ఉపాధ్యాయుడు మరణించగా మరో టీచర్‌, సెక్యూరిటీ గార్డు గాయపడ్డారు. ఈ సంఘటన నేపథ్యంలో విద్యార్థులు తలుపులు లాక్‌ చేసుకుని క్లాస్‌రూమ్స్‌లో ఉండిపోయారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు