Friday, May 17, 2024

బీజేపీ ఎన్నికల కమిటీల ప్రకటన..

తప్పక చదవండి
  • అజిటేషన్ కమిటీ చైర్మన్ గా విజయశాంతి..
  • మొత్తం అధికారికంగా 14 కమిటీల ప్రకటన..

న్యూ ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికి సన్నద్ధమయ్యాయి. ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకమైన ఎన్నికలు కావడంతో ఎవరికివారు వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. మూడవసారి అధికారాన్ని చేజిక్కించుకుని పరిపాలన సాగించాలని బీఆర్ఎస్, బి ఆర్ ఎస్ ను గద్దె దించి కారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్, తెలంగాణలో కమలం వికసించేలా చేసి, కాషాయ జెండాను రెపరెపలాడి బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు దూకుడుగా వెళ్లాలని భావిస్తున్న బీజేపీ ఈ మేరకు ఎన్నికల కమిటీలను ప్రకటించింది. 14 ఎన్నికల కమిటీలను నియామకం చేసిన బిజెపి కమిటీలలో దిగ్గజ నేతలకు పగ్గాలు అప్పగించింది. మేనిఫెస్టో అండ్ పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా వివేక్ వెంకటస్వామిని, కన్వీనర్ గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్ గా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించింది. ఇక పబ్లిక్ మీటింగ్స్ కు ఇన్చార్జిగా బండి సంజయ్ ను, చార్జిషీట్ కమిటీ చైర్మన్ గా మురళీధర్ రావు ను, అజిటేషన్ కమిటీ చైర్మన్ గా విజయశాంతిని నియమించింది. సోషల్ ఔట్ రీచ్ కమిటీ చైర్మన్ గా కోవ లక్ష్మణ్, ఇన్ఫ్లుయెన్సర్ ఔట్ రీచ్ కమిటీ చైర్మన్ గా డీకే అరుణ, సోషల్ మీడియా చైర్మన్ గా ఎంపీ అరవింద్, ఎలక్షన్ కమిషన్ ఇష్యూల కమిటీ చైర్మన్ గా మర్రి శశిధర్ రెడ్డి, హెడ్ క్వార్టర్స్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా నల్లు ఇంద్రసేనారెడ్డి, మీడియా కమిటీ చైర్మన్ గా రఘునందన్ రావును నియమించింది. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా వదిరే శ్రీరామ్ ఎస్సీ నియోజకవర్గాల కమిటీ చైర్మన్ గా జితేందర్ రెడ్డి ఎస్టీ నియోజకవర్గాల కమిటీ చైర్మన్ గా గరికపాటి మోహన్ రావును తెలంగాణ బిజెపి నియమించింది. మొత్తం 14 కమిటీలను ఏర్పాటు చేసిన బిజెపి ఈ మేరకు అధికారికంగా కమిటీలను ప్రకటించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు