Friday, May 17, 2024

సీఎం జగన్‌ను కలిసిన రాష్ట్ర వీఆర్వో అసోసియేషన్ నేతలు..

తప్పక చదవండి
  • పదోన్నతులు కల్పించాలని వినతి..
    ఏపీ ముఖ్యమంత్రివైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో రాష్ట్ర వీఆర్వో అసోసియేషన్ నేతలు సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన వీఆర్వో సంఘం ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గ సభ్యులు జగన్‌ను కలిశారు. “అర్హత కల్గిన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని సీఎం వైఎస్ జగన్‌ను కోరాం. ప్రస్తుతం వీఆర్వోల పదోన్నతుల్లో 40 శాతం రేషియో అమల్లో ఉంది. దీనివల్ల చాలా మంది వీఆర్వోలకు సీనియర్ సహాయకుల పోస్టులు రావడం లేదు. వీఆర్వోల పదోన్నతుల్లో 70 శాతం రేషియో ఇవ్వాలి. ఎక్కువ మందికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. విధి నిర్వహణలో వీఆర్వో చనిపోతే కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ఇవ్వాలని కోరాం. రాష్ట్రంలో వీఆర్ఏ నుంచి వీఆర్వోకు అర్హత కల్గిన వారు 1500 మంది ఉన్నారు. వీరందరికీ అర్హత పరీక్ష నిర్వహించి వీఆర్వో లుగా పదోన్నతి కల్పించాలని సీఎంను కోరాం. మా వినతిపై సీఎం సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో వీఆర్వోల సమస్యలపై కృషి చేస్తాం. ఇప్పటి వరకు వీఆర్వోల సమస్యలను పరిష్కరించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపాం”. అని ఏపీ గ్రామ రెవెన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్రరాజు అన్నారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు