Sunday, October 13, 2024
spot_img

నార్త్ అమెరికాలో సలార్ సరికొత్త రికార్డు..

తప్పక చదవండి

మరో రెండు నెలల్లో రిలీజ్ కాబోతున్న సలార్ కోసం ప్రపంచ సినీ లవర్స్ అంతా ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. పది రోజుల ముందు రిలీజైన టీజర్ కే ఊగిపోతుంటే.. అసలు బొమ్మ రిలీజయ్యాక ప్రేక్షకుల హంగామా ఏ రేంజ్లో ఉండబోతుందని ఊహిస్తేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆదిపురుష్ చేసిన గాయానికి అసలు సిసలైన మందు సలారే. సరిగ్గా పదకొండు రోజుల కిందట జూలై 6న కోడికూత వినకముందే సలార్‌ ఊచకోతను చూపించి ప్రభాస్‌ అభిమానులను ఆనందపు అంచుల్లో నిలబెట్టాడు ప్రశాంత్‌ నీల్‌. జురాసిక్‌ పార్కులో డైనోసర్‌ ముందు ఏదైనా దిగదుడుపే అన్న రేంజ్‌లో ప్రభాస్‌కు ఎలివేషన్‌ ఇవ్వడం వేరే లెవల్‌. ఒక్క టీజర్‌తో యావత్‌ సినీ అభిమానుల్లో తిరుగులేని అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. ఇక వచ్చే నెలలో ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుందని అప్పుడే ప్రకటన కూడా ఇచ్చేశారు.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓ అన్ బ్రేకబుల్ రికార్డు క్రియేట్ చేసింది. తొలిసారి ఓ భారతీయ సినిమా నార్త్ అమెరికాలో కనీవినీ ఎరుగని రేంజ్లో రిలీజుకు రెడీ అవుతుంది. ఒక్క నార్త్ అమెరికాలోనే దాదాపు 1979 లోకేషన్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది. హాలీవుడ్ సినిమాలు తప్పితే మునుపెన్నడూ అన్నేసి కేంద్రాల్లో ఇండియన్ సినిమా రిలీజ్ కాలేదు. దీన్ని బట్టి చూస్తేనే తెలుస్తుంది.. సలార్ పై ఏ రేంజ్లో హైప్ ఉందోనని. ఇక బయటకు వినిపంచట్లేదు కానీ లోలోపల భారీ మొత్తంలో ఈ సినిమాకు బిజినెస్ జరుగుతుందట. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే సలార్ బిజినెస్ లెక్కలు రెండొందల కోట్లు దాటుతున్నాయని ఇన్ సైడ్ టాక్.

- Advertisement -

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్‌ సినిమాను ఇంగ్లీష్‌ భాషలోనూ రిలీజ్‌ చేసేలా గట్టి ప్రయత్నాలే చేస్తుందట హోంబలే సంస్థ. అంతేకాకుండా విెదేశాల్లో పెద్ద ఎత్తున ఈ సినిమా రిలీజ్‌ను ప్లాన్‌ చేస్తున్నారట. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్‌ వర్క్‌ను పూర్తి చేసుకుంటుంది. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు