Thursday, October 10, 2024
spot_img

‘అలనాటి రామచంద్రుడు’ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది : దిల్ రాజు

తప్పక చదవండి
  • కృష్ణ వంశీ, మోక్ష, చిలుకూరి ఆకాష్ రెడ్డి, హైనివా క్రియేషన్స్ ‘అలనాటి రామచంద్రుడు’టీజర్ గ్రాండ్ గా లాంచ్

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. మోక్ష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు టీజర్ ని లాంచ్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా హాజరైన టీజర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
‘మా అమ్మ ఎప్పుడు చెప్పేది..

మనల్ని ఎవరైనా ప్రేమిస్తే.. ఎలాంటి పరిస్థితుల్లో వున్నా, ఎన్ని కారణాలు అడ్డు వచ్చినా.. ఆ ప్రేమని చనిపోయింతవరకూ వదులుకోకూడదు’ అనే డైలాగ్ మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమకథని చాలా కొత్తగా, మనసుని హత్తుకునేలా చూపించిన సన్నివేశాలు ప్రేక్షకులని కట్టిపడేశాయి. ‘’ఆ రాముడు సీత కోసం ఒక్కసారే యుద్ధం చేశారు. కానీ నా సీత కోసం ప్రతిక్షణం నాతో నేనే యుద్ధం చేస్తున్నా’ ‘కాలిపోతున్న కాగితానికి ఎంత ప్రేమ చూపించినా తిరిగిరాదు’’ అనే డైలాగ్స్ ప్రేమకథని డెప్త్ ని తెలియజేస్తున్నాయి. కృష్ణ వంశీ టీజర్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మోక్ష అందం, అభినయంతో అలరించింది. దర్శకుడు ఆకాష్ రెడ్డి హార్ట్ టచ్చింగ్ లవ్ స్టొరీని ప్రజెంట్ చేస్తున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా వున్నాయి. శశాంక్ అందించిన నేపధ్య సంగీతం మరింత ఆకర్షణగా నిలిచింది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.

- Advertisement -


టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ… మొన్న అయోధ్యలో ఆ రాముల వారికి ప్రాణ ప్రతిష్ట జరిగితే.. ఈ రోజు ‘అలనాటి రామచంద్రుడు’ టీజర్ బయటికి వచ్చింది. యాదృచ్ఛికంగా ఈ సినిమా టైటిల్ తో అది చక్కగా కుదిరింది. దర్శకుడు, నిర్మాత ఇలా అందరూ కొత్త టీంతో చేస్తున్న ఈ ప్రయత్నం బావుంది. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే సినిమాని థియేటర్లోకి తీసుకెళ్లడం గొప్ప విషయం. ఇకపై యూనిట్ అంతా చాలా హార్డ్ వర్క్ చేయాలి. సినిమాని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్ళాలి. టీజర్ చాలా ఆసక్తికరంగా వుంది. మాటలు చాలా బావున్నాయి. మనసుని హత్తుకునేలా వున్నాయి. హీరో, హీరోయిన్ చక్కగా నటించారు. సినిమా కూడా అద్భుతంగా వుండి, ప్రేక్షకుల ఆదరించాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.
దర్శకుడు చిలుకూరి ఆకాష్ రెడ్డి మాట్లాడుతూ.. దిల్ రాజు గారు టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. మా సినిమా గురించి చెప్పాలంటే.. శ్రీరాముల వారు సీతమ్మ కోసం తీసుకున్న గొప్ప నిర్ణయం రామసేతు నిర్మాణం. మా సినిమాలో సిద్దు అనే నిజాయితీ గల వ్యక్తి.. తన ప్రేమని చెప్పడానికి ఒక నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు తను ఎదుర్కున్న సమస్యలు ఏమిటి ? తన ప్రేమని ఎలా చేరుకున్నాడనేది కథ. మా నిర్మాతల ఋణం ఎప్పుడూ తీర్చుకోలేను. మమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు, శశాంక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. :-ప్రేమ్ సాగర్ వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. టెక్నికల్ టీం అంతా బ్రిలియంట్ గా వర్క్ చేశారు. చైతన్య గారు చాలా మంచి నటన కనబరిచారు. వెంకటేష్ కాకమాను పాత్రని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా చక్కని వినోదం వుంటుంది. మోక్ష ధరణి పాత్రలో ఒదిగిపోయింది. హీరో వంశీ ఈ కథకు పూర్తిగా న్యాయం చేశాడు. ఈ సినిమాతో తనకు చాలా మంచి పేరు వస్తుంది. తను అందరికీ నచ్చుతాడు. ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాయించుకుంటాడు. ఈ చిత్రం ఒక ఎమోషనల్ రైడ్. ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత చాలా హాయిగా బయటికి వస్తారు’’ అన్నారు,
హీరో కృష్ణ వంశీ మాట్లాడుతూ.. దిల్ రాజు గారు మాలాంటి కొత్తవారిని ప్రోత్సహించడానికి ఈ వేడుకకు రావడం చాలా అనందంగా వుంది. ఆయనకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. మాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. దర్శకుడు ఆకాష్ గారి సినిమా అంటే చాలా ఇష్టం. చాలా అందంగా పాత్రలని తీర్చిదిద్దారు. సంగీత దర్శకుడు, డీవోపీ.. టీంలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. చాలా మంచి వర్క్ ఇచ్చారు. మోక్ష చాలా అద్భుతంగా నటించింది. ఇందులో చాలా మంచి నటీనటులు వున్నారు. అందరి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.
హీరోయిన్ మోక్ష మాట్లాడుతూ.. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. దర్శకుడు నా పాత్రని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. వంశీ గారితో వర్క్ చేయడం చాలా గొప్ప అనుభూతి. చాలా మంచి టీంతో కలసి ఈ చిత్రం చేశాం. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.’’ తెలిపారు
నిర్మాత శ్రీరామ్ జడపోలు మాట్లాడుతూ.. మా టీజర్ లాంచ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించిన నిర్మాత దిల్ రాజు గారికి కృతజ్ఞతలు. చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఇష్టం. ఇది మా మొదటి సినిమా. ఇలాంటి ఎన్నో సినిమాలు తీయాలని బలంగా అనుకునే నిర్మాణం మొదలుపెట్టాం. దర్శకుడు ఆకాష్ ఈ కథ చెప్పినపుడు చాలా నచ్చింది. మనసుని ఆకట్టుకునే మాటలు రాశారు. టీం అంతా చాలా ఎనర్జీతో పని చేసింది. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. తప్పకుండా సినిమా ప్రేక్షకులని అలరిస్తుంది. మీ అందరి ప్రోత్సాహం కావాలి’’ అన్నారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు