Wednesday, April 24, 2024

ఏకే`47 రైఫిళ్లు, 10 మ్యాగ్జిన్లు, ఇతర ఆయుధాలు సీజ్‌

తప్పక చదవండి

జమ్మూ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే`47 రైఫిళ్లు, 10 మ్యాగ్జిన్లు, ఇతర ఆయుధాలను భద్రతా దళాలు సీజ్‌ చేశాయి. రాజౌరీ జిల్లాలోని కాల్‌కోట్‌ లో ఉన్న బాజీమాల్‌ ఏరియాలో ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. రాజౌరీ ఎదురుకాల్పుల్లో మరణించిన అయిదు మంది ఆర్మీ సిబ్బందికి ఇవాళ పుష్ప నివాళి అర్పించారు. రోమియో ఫోర్స్‌ ప్రధానకార్యాలయంలో ఆ ఈవెంట్‌ జరిగింది. సీనియర్‌ ఆర్మీ ఆఫీసర్లు ఇవాళ నివాళి అర్పించారు. నార్తర్న్‌ కమాండ్‌కు చెందిన కమాండిరగ్‌ చీఫ్‌ జనరల్‌ ఆఫసర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది కీలక ప్రకటన చేశారు. భారత్‌లోకి చొరబడుతున్న ఉగ్రవాదుల్లో .. పాకిస్థాన్‌ మాజీ సైనికులు ఉన్నట్లు ఆయన తెలిపారు. మరో ఏడాదిలో జమ్మూకశ్మీర్‌ నుంచి ఉగ్రవాదాన్ని అంతం చేయనున్నట్లు ద్వివేది చెప్పారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు