Sunday, June 23, 2024

మినర్వా, బ్లూ ఫాక్స్‌ హోటల్‌లో కల్తీ ఆహారం

తప్పక చదవండి
  • జి.హెచ్‌.ఎం.సి, అధికారులకు ఫిర్యాదు..?

ఎల్బీనగర్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మహా నగరం పలు రకాల వ్యాపార సముదాయం అందులో ముఖ్యమైనవి.. రెస్టారెంట్స్‌ హోటల్స్‌ ఈ రంగంలో తాజ్‌ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌, వంటివి తమ ఆహార పదార్థ రుచలను ప్రపంచానికి పరిచయం చేసింది, హైదరాబాద్‌ మహా నగరంలో సందర్భం ఏదైనా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు హోటల్స్‌, రెస్టారెంట్స్‌ లో తినడం కామన్‌ గా, మారిపోయింది.. ఉరుకుల, పరుగుల నగరం, జనాభాకు అనుగుణంగా, అంతకు మించి.. హోటల్స్‌, రెస్టారెంట్స్‌ చిన్న, చిన్న, కాలనీ ల నుండి, ప్రధాన రహదారుల వరకు విస్తరించాయి, కొందరు హోటల్స్‌, రెస్టారెంట్స్‌, నిర్వాహకులు తమ వ్యాపారమే దెయ్యంగా భావించి, నిషేదించబడ్డ ఆహార పదార్థాలను వాడడం, వినియోగదారులను ఆకర్షించడానికి, తినే ఆహారంలో కలర్‌ ఫుడ్‌ వాడడం, నిల్వ ఉంచిన మాంసం వంటి, ఆహార పదార్థాలను వండడం, వాటిని తిని ఎందరో అనారోగ్యాన బారిన పడుతున్నారు… కొన్ని హోటల్స్‌, రెస్టారెంట్స్‌ లో బిర్యానీలో బొద్దింకలు వచ్చిన సందర్భాలు అనేకం.. ఇటీవల కాలంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మహా నగరంలో ఈలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి… సరూర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మినర్వా, బ్లూ ఫాక్స్‌, రెస్టారెంట్‌లో ఓ కస్టమర్‌ బుధవారం రోజున, మధ్యాహ్నం లంచ్‌ చేయడానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళాడు పలు రకాల ఆహార పదార్థాలను ఆర్డర్‌ ఇచ్చాడు… ఆర్డర్‌ ఇచ్చిన వాటిలో కుళ్లిన ఆహారం ఉందని, రెండు,మూడు రోజుల క్రితం లాగా ఉందని.. జి.హెచ్‌. ఎం.సి. అధికారులకు ఫిర్యాదు చేశారు… రెస్టారెంట్‌ వ్యాపార రంగంలో ఎంతో పేరు ఉన్న హోటల్లో ఇలా జరగడం ఆశ్చర్యానికి గురిచేసిందని వినియోగదారుడు వాపోయాడు. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్న ఫుడ్‌, ఇన్స్పెక్టర్స్‌, జి.హెచ్‌.ఎం.సి.అధికారులు నామ, మాత్రం తనిఖీలు చేయడం వల్ల తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు జి.హెచ్‌.ఎం.సి అధికారులు ఫుడ్‌ ఇన్స్పెక్టర్స్‌ హోటల్స్‌ను సీజ్‌, చేసి ఫుడ్‌ లైసెన్స్‌ ను రద్దు చేయాలని సామాజిక కార్యకర్తలు అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు. మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో మరో కథనంతో మీ ముందుకు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు