Wednesday, April 24, 2024

హైదరాబాద్‌లో ఆదానీ గ్రూప్‌ భారీ పెట్టుబడి

తప్పక చదవండి

అదానీ గ్రూప్‌ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో పలు వ్యాపారాల ద్వారా రూ.12,400 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా వెల్లడిరచింది. ఈ మేరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడు లపై ఇరువురూ చర్చించి నాలుగు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. అధికారిక ప్రకటన ప్రకారం, హైదరాబాద్‌లో అదానీ గ్రీన్‌ ఎనర్జీ 1350 మెగావాట్ల రెండు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయడానికి రూ. 5వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. చందనవెల్లిలో డేటా సెంటర్‌ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు అదానీకాన్‌ఎక్స్‌ డేటా సెంటర్‌ రూ. 5వేలకోట్లు పెట్టుబడి పెట్టనుంది. అంబుజా సిమెంట్స్‌ లిమిటెడ్‌ తెలంగాణలో ఏడాదికి 6 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో సిమెంట్‌ గైర్రడిరగ్‌ యూనిట్‌లో రూ.14వందల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తెలంగాణలోని హైదరాబాద్‌లోని అదానీ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ పార్క్‌లోని కౌంటర్‌ డ్రోన్‌ సిస్టమ్స్‌, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలలో అదానీ గ్రూప్‌ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, సహాయాన్ని అందజేస్తుందని గౌతమ్‌ అదానీకి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏరో స్పేస్‌ పార్కుతో పాటు డేటా సెంటర్‌ ప్రాజెక్టు నెలకొల్పేందుకు అదానీ గ్రూప్‌ సీఎం రేవంత్‌తో చర్చలు జరిపింది. వీటికి సంబంధించిన పురోగతితో పాటు కొత్త ప్రాజెక్టుల స్థాపనపై సమావేశంలో చర్చించారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో సీఎం రేవంత్‌తో అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. రాష్ట్రంలో 12వేల 400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించినట్లు సమాచారం. సిఎం వెంట మంత్రి శ్రీధర్‌ బాబుతో పాటు, ఉన్నతస్థాయి అధికారుల బృందం కూడా ఉంది.

ఆరాజెన్‌లైఫ్‌ సైన్సెస్‌తో తాజా ఒప్పందం
తాజాగా ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌తో ఒప్పందం కుదిరింది. తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ మరిన్ని పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రూ.2,000 కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 1,500 కొత్త ఉద్యోగాలను అందించేలా తమ ప్రాజెక్టులను విస్తరించనుంది. మల్లాపూర్‌లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని మరింత పెంచుకోవడానికి కొత్త పెట్టుబడులు పెడుతోంది. దీంతో ఆసియాలోనే ఔషధ పరిశ్రమకు హబ్‌ గా పేరొందిన హైదరాబాద్‌ స్థానం మరింత సుస్థిరమవనుంది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సులో భాగంగా ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ సీఈవో మణి కంటిపూడి, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తో భేటీ అయ్యారు. ఫార్మారంగంలో గ్లోబల్‌ లీడర్‌గా ఉన్న ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి ప్రణాళికలను ఎంచుకోవడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఈ పెట్టుబడులు దోహదపడుతాయన్నారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు సిద్ధించటంతో పాటు భవిష్యత్‌ కు అవసరమైన శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతుందని పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలతో ఇక్కడున్న ప్రతిభా నైపుణ్యాలకు మరింత గుర్తింపు వస్తుందని సీఎం అన్నారు. రాబోయే ఐదేళ్లలో తమ సేవలను విస్తరించే ప్రణాళికను ప్రకటించడం సంతోషంగా ఉందని కంపెనీ సీఈవో మణి కంటిపూడి అన్నారు. హైదరాబాద్‌లో రూ.2వేలకోట్ల పెట్టుబడులకు నిర్ణయం తీసుకున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కొత్త ఔషధ ఆవిష్కరణలు, పరిశోధన సంస్థల కేంద్రంగా హైదరాబాద్‌ జాతీయ స్థాయిలో తనకున్న హోదాను నిలబెట్టుకుంటుందనే విశ్వాసం కలుగుతోందన్నారు. తమ కంపెనీ విస్తరణకు తగినంత మద్దతు ఇచ్చిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ విస్తరణతో హైదరాబాద్‌ దేశంలోనే కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ హబ్‌గా మారనుంది. కొత్త డ్రగ్స్‌, డివైజ్‌లను కనుగొనేందుకు, అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 1,000 మందికి పైగా ఆవిష్కర్తలకు హైదరాబాద్‌ సేవలందిస్తోంది. కొత్త ఔషధాల సృష్టి, అభివృద్ధి, తయారీ సేవల విభాగంలో ఆరాజెన్‌ కంపెనీకి 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నది. ఫార్మాస్యూటికల్‌, బయోటెక్నాలజీ రంగాలకు కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ సేవలను ఈ కంపెనీ అందిస్తోంది. రాబోయే అయిదేండ్లలో తమ సేవలను విస్తరించే ప్రణాళికను ప్రకటించటం సంతోషంగా ఉందని కంపెనీ సీఈవో మణి కంటిపూడి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కొత్త ఔషధ ఆవిష్కరణలు, పరిశోధన సంస్థల కేంద్రంగా హైదరాబాద్‌ జాతీయ స్థాయిలో తనకున్న హోదాను నిలబెట్టుకుంటుందనే విశ్వాసం కలుగుతోందన్నారు. తమ కంపెనీ విస్తరణకు తగినంత మద్దతు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ విస్తరణతో హైదరాబాద్‌ దేశంలోనే కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ హబ్‌ గా మారనుంది. కొత్త డ్రగ్స్‌, డివైజ్‌లను కనుగొనేందుకు, అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 1,000 మందికి పైగా ఆవిష్కర్తలకు హైదరాబాద్‌ సేవలందిస్తోంది. కొత్త ఔషదాల సృష్టి, అభివృద్ధి, తయారీ సేవల విభాగంలో ఆరాజెన్‌ కంపెనీకి 20 ఏళ్లకుపైగా అనుభవముంది. ఫార్మాస్యూటికల్‌, బయోటెక్నాలజీ రంగాలకు కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సేవలను ఈ కంపెనీ అందిస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు