Saturday, April 27, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

దేశభక్తి జీవితం కంటే గొప్పదని..
మానవత్వం దేశభక్తి కంటే గొప్పదని నమ్మారు గాంధీజీ..
భరత జాతి బానిసత్వ విముక్తికై
చివరి క్షణం వరకు అహింసా ఆయుధంతో..
స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను సాధించారు..
ఏ పదవి ఆశించని వారి
నిస్వార్థ త్యాగాల ముందు మనమెంత? మనమెక్కడ?
గాలికి పోయే ఆశయా (మాట)ల కన్నా..
కక్కిన కూడుకు ఆశపడి గద్దె
అంటిపెట్టుకొని ఉండడం మిన్న అని..
గజ్జె కట్టి ఆడుతున్న శీల హీన రాజకీయాలు వీడాలి!
గాంధీ కలలుగన్న స్వాతంత్య్రం..
రాజకీయమైనది కాదు?
సరికొత్త సమ సమాజాన్ని సృష్టించాలన్న
అమర సందేశ స్ఫూర్తితో..
గాంధీజీ ఆశయాలను, ఆకాంక్షలను
నెరవేర్చడమే పాలకులు పాలితులు వారికిచ్చే నివాళులు..

- మేదాజీ    
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు