Tuesday, May 21, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

అనాగరికతను నాగరికతగా కల్లిబొల్లి కథలల్లి..
మత ప్రచారకులను మేధావులుగా కీర్తిస్తూ..
మూఢనమ్మకాలను పాడుశకునాలను
పాటించమంటూ అశాస్త్రీయ వాదాలకు గోడకాడుతున్నారు..
విజ్ఞాన భావాలను బొందలగడ్డలో సమాధిచేసి
మతాల మలినాలను పుస్తకాలలో అచ్చేసి..
రేపటి తరాలపై బురదజల్లుతున్నారు..
బాబాలను, పాస్టర్లను, పూజర్లను నమ్ముతూ..
సన్యాసులకు రాజపీఠాల పట్టంకడుతున్నారు..
రాతియుగ కాలపు ఆలోచనలకు గోతులు
తవ్వుతున్నారు…
ఇక నా దేశం వెనక్కి వెళ్లక ముందుకెట్లా నడుస్తుంది..?

  • సన్నీ
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు