Saturday, July 27, 2024

చిత్రపురిలో చిత్రాలు..

తప్పక చదవండి
  • బూబాకాసురుల మాయాజాలం..
  • పేదల నోట్లో మట్టి కొడుతున్న పెద్దమనుషులు..

1994 అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి, సినీ పేద కార్మికుల కోసం, జి డి 658 ద్వారా ప్లాట్స్‌ మాత్రమే కట్టి ఎక్కువ మందికి కేటాయించాలని జి ఓ 658 ఇవ్వడమైనది. చిత్రపురి కాలనీలో ఎంతో మంది సినిమా కార్మికులకు ఇళ్లు లేవు అని బాదను చూస్తున్నారు. కాని కొందరు సినిమా పెద్దలు కుమ్మక్కు అయి అప్పుడు హెచ్‌ ఎం డి ఏ వారికి జి ఓ గురించి తెలియనీయ కుండా మోసం చేసి 14 ఎకరాలు కేటాయించుకుని 225 ఇండ్లు కట్టుకునే విధంగా పర్మిషన్‌ తీసుకోవడం జరిగింది. ఆ ఇల్లు సినిమా పెద్దలు, ఈ కమిటీ సభ్యులు, ఇప్పుడు పోరాటాలు చేస్తున్న వారికి మాత్రమే ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు 3 కోట్ల రూపాయలకు అమ్ముతున్నారు. అసలు హెచ్‌ ఎం డి ఏ వారు ఒకవేళ పర్మిషన్‌ ఇచ్చిన ముందు చూపుతో 1530 స్క్వేర్‌ ఫీట్‌ (1ం1 ఫ్లోర్‌ కు మాత్రమే ఇవ్వడమైనది. ఎందుకు అనగా అవసరమైతే పైన మరొక ఇల్లు కట్టవచ్చు అని, కానీ గత ఇప్పటి కమిటీ కొత్త పోకడతో హెచ్‌ ఎం డి ఏ పర్మిషన్‌ లేకుండా 1530 స్క్వేర్‌ ఫీట్‌ నుండి 2250 స్క్వేర్‌ ఫీట్‌ కట్టడం జరిగినది. జి ం1ం1 కట్టడం వలన మరో 225 మంది సభ్యులకు అన్యాయం జరిగిందని పలువురు సినీ కార్మికులు వాపో తున్నారు. అలా కాక కొందరు సభ్యులు 2250 స్క్వేర్‌ ఫీట్‌ కాక 4 వ ఫ్లోర్‌ కూడా వేస్తున్నారు. కావున వెంటనే చర్యలు తీసుకోవాలని అంటు న్నారు. దీని గురించి సుదీర్ఘంగా ఎంక్వయిరీ చేస్తే హెచ్‌ ఎం డి ఏ అధి కారులు తో మాట్లాడితే 2250 స్క్వేర్‌ ఫీట్‌ కట్టినట్టు మా దృష్టిలో లేదు. ఏదో 6 ఇల్లు ఎక్కువ కట్టినారు అని మాత్రమే మాకు కంప్లైంట్స్‌ వచ్చిన ప్పుడు మేము ఎంక్వయిరీ చేస్తే మొత్తం పర్మిషన్‌ లేకుండా కట్టినారని, ఆ తరువాత కంప్లెంట్స్‌ వచ్చినాయని తెలిసి మొత్తం రో హౌస్‌ పడగొట్టమని మున్సిపల్‌ వారికి చెప్పామని చెప్పారు. అయినను ఇప్పుడు ఉన్న కమిటీ సభ్యులు రో హౌస్‌లు పడగొట్టనీయకుండా బిఆర్‌ఎస్‌ నాయకులను, మణి కొండ మున్సిపాలిటీ అధికారులను అడ్డం పెట్టుకొని పడగొట్టనీయలేదు. ఇప్పుడు పడగొట్టి న్యాయం చేయండని అన్నారు. 14 ఎకరాలు, 1400 కోట్లు భూమి 225 మంది సభ్యులు కలసి పేద కార్మికులకు అన్యాయం చేస్తు న్నారు. హెచ్‌ ఎం డి ఏ వారు రో హౌస్‌ లకు ఇలా పర్మిషన్‌ ఇవ్వకూ డదు. ఆ రో హౌస్‌ లు అన్ని తీసివేసి ప్లాట్స్‌ కట్టవచ్చు అని చెప్పడం జరిగి నది. కావున వెంటనే రో హౌస్‌ లు తీసేసి ఆ 225 మంది సభ్యులకు కూడా అన్యా యం జరగకుండా 1530 స్క్వేర్‌ ఫీట్‌ బదులుగా 3000 స్క్వేర్‌ ఫీట్‌ వచ్చే విధంగా ప్లాట్స్‌ కట్టి ఇవ్వాలని కార్మికులు కొరుకుతున్నాడు. ఇప్పటి వరకు రాజకీయ పెద్దలను తప్పు దోవ పట్టిస్తూ ఈ జి ఓ ఎక్కడ చూపకుం డా ఇక్కడ ఏదో అన్యాయం జరుగుచున్నది అని చూపడం జరుగుతుంది. ఇక్కడ 14 ఎకరాలులో ప్లాట్లు కడితే సుమారు 3000 మంది సినిమా కార్మికులకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు నిజమైన సినిమా కార్మికులకు న్యాయం జరగాలంటే ఇప్పుడు కాంగ్రెస్‌ పెద్దలు చొరవ తీసుకోని మంచి ఆలోచన చేసి అందరికి న్యాయం జరిగే విధంగా చేయాలని కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు