Saturday, May 4, 2024

తవ్వారు వదిలేశారు..

తప్పక చదవండి
  • సంవత్సరం దాటినా వేయని రోడ్డు..
  • పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
  • అరిగోస పడుతున్న బస్తీ వాసులు
    మల్కాజిగిరి : కొండ నాలుకకు మందేస్తే,ఉన్న నాలుక ఊడిరది అనే సామెతకు సరిగ్గా సరిపోయే విధంగా మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్‌ నగర్‌ 141 డివిజన్‌ పరిధిలోని అన్నపూర్ణ సొసైటీ టీచర్స్‌ కాలనీలో అధికారులు చేసిన పనిని చూస్తే సామెతకు సరిగ్గా సరిపోతుంది.

రోడ్డు సరిగ్గా లేదని బస్తీ వాసులు రోడ్డు వెయ్యాలని కోరితే,రోడ్డు వేస్తామని తవ్వి సంవత్సరం దాటిన ఇప్పటి వారికి రోడ్డు వేయకపోవడంతో బస్తీ వాసులు నరకం చూస్తున్నానని వ్యాపోతు న్నారు.టీచర్స్‌ కాలనీలో నివసించే దత్తు భాయ్‌ అనే మహిళ ఇంటి ముందు రోడ్డు తవ్వి సంవత్సరం దాటిన రోడ్డు వేయకపో వడంతో ఇంట్లోకి వెళ్లి వచ్చే సమయంలో రెండుసార్లు కిందపడి గాయల పాలయ్యానని తన బాధ వెల్లపుచ్చుకుంటుంది.

ఎన్నోసార్లు అధికారులు,నాయకుల చుట్టూ తిరిగినా కోర్టులో కేసు ఉందనే సాకుతో రోడ్డు వేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు.కోర్టు కేసులో ఉన్న పరిధి కాకుండా మిగతా చోట్ల రోడ్డు వేయాలని కోరిన,వాళ్ళ గోడును పట్టించుకునే నాధుడే లేడని అంటున్నారు,ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరు వచ్చి తమ బాధను పట్టించుకునే వారు లేరని అన్నారు.ఎలక్షన్స్‌ సమయంలో ఎవరైనా వస్తే ఊకునే ప్రసక్తే లేదని ప్రజాప్రతినిధుల తీరుపై దత్తు భాయ్‌ మండిపడుతున్నారు.రోడ్డు సరిగ్గా లేక 365 రోజులు, 24 గంటలు తమ ఇంటి ఎదురుగా మురికి నీళ్లు ప్రవహిస్తున్నాయని, పాములు పురుగులు ఇంట్లోకి వస్తున్నాయని ఆవేదన చెందుతు న్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు వేయకపోతే జిహెచ్‌ఎంసి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు