Tuesday, May 14, 2024

ప్రభుత్వ భూమి యధేచ్ఛగా కబ్జా

తప్పక చదవండి
  • చోద్యం చూస్తున్నరెవెన్యూ అధికారులు
    కీసర : దమ్మాయిగూడ మున్సిపల్‌ పరిధిలోని సర్వే నంబర్‌ 504 లో గల ప్రభుత్వ భూమి కబ్జాకి గురవుతుంది. ప్రభుత్వ భూమిలోకి జరిగి రియల్టర్లు నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోవలసిన రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ కబ్జాల వెనుక దమ్మాయిగూడకి చెందిన ఒక ప్రజాప్రతినిధి హస్తం ఉందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్‌ 504 లో గల 3 ఎకరాల 14 గుంటల ప్రభుత్వ భూమి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సగానికి పైగా కబ్జా చేయబడిరది.

ఐనా కూడా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దమ్మాయిగూడలో వైకుంఠధామం లేకపోవడంతో ఆఖరి మజిలీకి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఉన్న ప్రభుత్వ భూమిని కూడా ప్రజా అవసరా లకు కేటాయింపు జరిగేలా చేయడంలో ప్రజాప్రతినిధులు విఫలమవు తున్నారని దమ్మాయిగూడ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, సర్వే నంబర్‌ 504లోని ప్రభుత్వ భూమిని కాపాడడంతో పాటు ఆ భూమిని ప్రజా అవసరాల కోసం వినియోగించేలా చూడాలని దమ్మాయిగూడ ప్రజలు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు