Sunday, May 19, 2024

భారత సంతతి బాలికకు వైట్‌ హౌస్‌లో సత్కారం

తప్పక చదవండి

వాషింగ్టన్‌ : ఇండియన్‌`అమెరికన్‌ యువ శాస్త్రవేత్త గీతాంజలిరావు (17) ను అమెరికా ప్రథమ పౌరురాలు జిల్‌ బైడెన్‌ వైట్‌ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో సత్కరించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ‘గర్ల్స్‌ లీడిరగ్‌ ఛేంజ్‌’ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా తమ తోటివారిలో మార్పు తీసుకొచ్చి, మెరుగైన భవిష్యత్తును తీర్చిది ద్దడానికి కృషి చేసిన 15 మందిని వైట్‌ హౌస్‌ జెండర్‌ పాలసీ కౌన్సిల్‌ ఎంపిక చేసింది. వీరిని జిల్‌ బైడెన్‌ సత్కరించారు. కొలరాడోకు చెందిన గీతాంజలి రావు కాలుష్యాన్ని కనుగొనే సాధనాన్ని అభి వృద్ధిపరచారు. దీనికి ఈపీఏ ప్రెసిడెన్షియల్‌ అవార్డు, అమెరికాస్‌ టాప్‌ యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు లభించాయి. ఆమె రూపొందించిన ‘ఎస్‌టీఈఎంకు యంగ్‌ ఇన్నోవేటర్స్‌ గైడ్‌’ 80 వేలకుపైగా ప్రాథ మిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు చేరింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు