Friday, May 3, 2024

విలేకరిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు

తప్పక చదవండి
  • మేకల భార్గవ్‌, అనుచరుడు కాశీ దాడికి పాల్పడిన వారిపై
    కేసు నమోదు చేసిన శామీర్‌పేట్‌ పోలీసులు

శామీర్‌ పేట్‌(ఆదాబ్‌ హైదరాబాద్‌): విలేకరిపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై శామీర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల శామీర్పేటలో జరిగిన కురమ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఓ విలేకరిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. కురుమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన (మంత్రి మల్లారెడ్డి ప్రచార కార్యక్రమం) సమావేశానికి జవహార్నగర్‌ కార్పోరేషన్‌ మేయర్‌ మేకల కావ్య, తండ్రి అయ్యప్ప ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. శామీర్పేట సెలబ్రిటీ రిసార్ట్లోని ఖాళీ స్థలంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా అప్పటి మంత్రి చామకూర మల్లారెడ్డికి సంబంధించిన కళాశాలల బస్సులలతో పెద్ద ఎత్తున జనసమీ కరణ, మంత్రి మల్లారెడ్డి అనుచరులతో విందు ఏర్పాటు చేసిన విషయం తెలుసుకున్న కొందరు శామీర్పేట విలేకరులు అక్కడికి వెళ్ళారు. అదే సమయంలో ఎన్నికల విధులు నిర్వహి స్తున్న ప్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు కూడా అక్కడికి చేరుకు న్నారు. ఎన్నికల సమయంలో అనుమతులు లేకుండా ఇలాంటి సమా వేశాలు నిర్వహించరాదని హెచ్చరించారు. అయినా వారి మాటలు పట్టించుకోకుండా సుమారు రెండు వేలకు పైగా జనంతో సజావుగా సమావేశం నిర్వహించారు. అయితే సమా వేశంలో జవహార్నగర్‌ మేయర్‌ కావ్య, తన తండ్రి అయ్యప్ప, తోటి అనుచరులు మేడ్చల్‌ నియోజకవర్గం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డికి కురుమ కులస్తులు అందరూ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని, ఇదంతా ఎమ్మెల్యే అభ్యర్థి మల్లారెడ్డి ఏర్పాటు చేసిన సమావేశమేనని తేల్చి చెప్పారు. ఇంతలో అక్కడ ఉన్న కొందరు కురుమ సంఘం నాయకులు కురుమ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి మల్లారెడ్డికి ఓటు వేయమనడం ఎంతవరకు సమంజసమని వాగ్వివాదానికి దిగారు. మాటా మాటా పెరిగి ఆత్మీయ సమ్మేళనం కాస్తా రాజ కీయ సమావేశం కావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమావేశంలో కూర్చున్న జనం కాస్తా కూర్చీలు ఎత్తి కొట్టుకునే స్థాయికి చేరింది. అక్కడే ఉన్న విలేకరులు కొందరు అక్కడి సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఓ విలేకరిపై కొందరు విరుచుకు పడ్డారు. మేము నిర్వహించుకుంటున్న సమావేశంలో మీకేం పని అని, విలేకరులైతే ఏంపీ… ని దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా విలేకరి ఫోన్‌ లాక్కొని అతన్ని నెట్టివేశారు. వారంతా ఒక్కసారిగా విలేకరిపై దాడికి పాల్పడుతూ నోటికి వచ్చినట్లుగా దుర్భాషలాడారు. దీంతో దిక్కుతోచని స్థితిలో అక్కడి నుండి విలేకరులు నేరుగా శామీర్పేట పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చి జరిగిన విషయాన్ని ఆధారాలతో సహా పోలీసులకు వివరించి, ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో హడావిడిగా ఉన్న పోలీ సులు ఫిర్యాదు స్వీకరించి, కోర్టు అనుమతులతో మంగళవారం కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన మేకల భార్గవ్‌, కాశిలపై సెక్షన్‌ 323, 506 కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. విలేకరిపై దాడికి పాల్పడిన కేసులో నిందితులను రిమాండ్కు తరలించి కోర్టుకు హాజరు పరుస్తామని శామీర్పేట ఎస్‌ ఐ మునింధర్‌ తెలిపారు. విలేకరులు చేసిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకున్న శామీర్పేట పోలీసుల పనితీరుకు శామీర్పేట, మేడ్చల్‌ జిల్లా విలేకరులు హర్షం వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు