Friday, May 17, 2024

600 కిలోమీట‌ర్ల దూరంలో విక్ర‌మ్..

తప్పక చదవండి
  • ల్యాండ‌ర్‌ను ఫోటో తీసిన నాసా ఆర్బిటార్‌
    న్యూఢిల్లీ : అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా కు చెందిన లూనార్ రిక‌న్నై’సెన్స్’ ఆర్బిటార్ ప్ర‌స్తుతం చంద్రుడి చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ శాటిలైట్‌కు .. చంద్ర‌యాన్‌-3కి చెందిన విక్ర‌మ్ ల్యాండ‌ర్ చిక్కింది. విక్ర‌మ్‌ను ఆ ఆర్బిటార్ ఫోటో తీసింది. ఆ ఫోటోల‌ను నాసా త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. ఆగ‌స్టు 23వ తేదీన ద‌క్షిణ ద్రువానికి 600 కిలోమీట‌ర్ల దూరంలో విక్ర‌మ్ ల్యాండ‌ర్ దిగిన‌ట్లు నాసా పేర్కొన్న‌ది. అయితే ఆగ‌స్టు 27వ తేదీన నాసాకు చెందిన ఎల్ఆర్వో ఈ ఫోటోను తీసింది. ల్యాండింగ్ జ‌రిగిన నాలుగు రోజుల త‌ర్వాత ఆ ఫోటో తీశారు. విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ను 42 డిగ్రీల కోణంలో ఎల్ఆర్వో కెమెరా ఫోటో తీసినట్లు నాసా వెల్ల‌డించింది. అయితే ఆ ల్యాండ‌ర్ నుంచి వెలుబ‌డిన వాయువులు, అక్క‌డి నేల‌తో ఇంట‌రాక్ట్ కావ‌డం వ‌ల్ల విక్ర‌మ్ చుట్టూ ఆ బ్రైట్ వెలుతురు క‌నిపించిన‌ట్లు నాసా తెలిపింది. మేరీల్యాండ్‌లోని గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న గోడార్డ్ స్పేస్ ఫ్ల‌యిట్ సెంట‌ర్ నుంచి ఎల్ఆర్వో కెమెరాల‌ను నాసా మేనేజ్ చేస్తోంది. మ‌రో వైపు ఇస్రో మంగ‌ళ‌వారం చంద్రుడికి చెందిన 3డీ ఇమేజ్‌ను రిలీజ్ చేసింది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు