Wednesday, May 15, 2024

భారత్‌ పెట్రోలియంలో పోస్టులు..

తప్పక చదవండి
  • నెలకు రూ. 25 వేలు జీతం..
  • అప్రెంటిస్ (సవరణ) చట్టం, 1973 ప్రకారం,
    అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు..
  • ఒక ప్రకటనలో పేర్కొన్న అధికారులు..

హైదరాబాద్ :
అధికారులు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 125 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.. వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. డిగ్రీలో చేసిన చేసిన స్పెషలైజేషన్‌ ఆధారంగా అప్రెంటిస్‌ పోస్టుకు ఎంపిక చేస్తారు.

ఇక గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించకూడదు. అయితే నిబంధనల ఆధారంగా వయసు విషయంలో వయో సడలింపు వర్తిస్తుంది. ఇందుకోసం పూర్తి నోటిఫికేషన్ చూడాల్సి ఉంటుందని అధికారులు అభ్యర్థులకు సూచించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 25,000 వరకు స్టైఫండ్‌ అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఒక ఏడాది పాటు అప్రెంటిస్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ధరఖాస్తుల స్వీకరణకు 15-09-2023ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌ సైట్‌ క్లిక్‌ చేయండి. https://www.bharatpetroleum.in/

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు