Saturday, May 18, 2024

బీఆర్ఎస్ లేకపోతే పార్లమెంట్‌లో తెలంగాణ ఉనికే లేదు

తప్పక చదవండి
  • నాయకులు, కార్యకర్తలు సంయనం కోల్పోవద్దు వచ్చేది మన ప్రభుత్వమే
  • జరిగిందేదో జరిగింది ఇప్పుడు కలిసి కట్టుగా పనిచేద్దాం విజయాన్ని సాధిద్దాం
  • కాంగ్రెస్ మోసపూరిత హామీలపైన కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్లెట్ విడుదల
  • కేవలం గెలవడం కోసమే అసత్యాలను ప్రచారం చేసిందన్న మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,, ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి ఇచ్చిన 420 హామీలను ప్రజల దగ్గరకు తీసుకెళ్తామని తెలిపారు. ఎన్నికల హామీలను ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. అబద్దాలు, అసత్యాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్ సర్కార్ దిగజారుడు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును బద్నాం చేసేలా కాంగ్రెస్, బీజేపీ వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో దివాళా తీసిన కాంగ్రెస్ పార్టీ.. పొరపాటున అధికారం దక్కించుకుని రాష్ట్రం దివాలా తీసిందని అంటున్నారని విమర్శించారు. రేవంత్ సర్కార్ కు 100 రోజుల కౌంట్ డౌన్ మొదలైందన్న కేటీఆర్.. వంద రోజుల్లో హామీలు అమలు చేయకపోతే బొంద పెట్టేలా మా కార్యాచరణ అమలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే ఎన్నికల హామీలను నెరవేర్చాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేటీఆర్.డిసెంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. మా నేతలు, కార్యకర్తలు ఎన్నో అంశాలు మాకు నిక్కచ్చిగా చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో జరుగుతున్న చర్చ మా దృష్టికి వస్తుంది. మా నేతలు చెబుతున్న మాటలు ప్రజల మాటగా భావిస్తున్నాము. కొన్ని లోటుపాట్లు సవరించుకుంటే బాగుంటుందని చెప్పారు. పార్టీ నిర్మాణం లేకపోవడం కూడా ఓ కారణంగా నేతలు స్పష్టం చేశారు. దుష్ప్రచారాన్ని సరిగా ఎదుర్కోలేకపోయామనే అభిప్రాయం వచ్చింది. కేసీఆర్ సీఎంగా లేరన్న మాటను జీర్ణించుకోలేకపోతున్నామని గ్రామాల్లో అంటున్నారు. మా తరపున ఉన్న పొరపాట్లపై చర్చించుకున్నాం.

రాష్ట్ర హక్కుల కోసం ప్రత్యేకంగా కోరేది బీఆర్ఎస్.
పార్లమెంట్ సన్నాహక సమావేశాల అనంతరం నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఉంటాయి. కాంగ్రెస్ నేతల దాడులను ఎండగట్టే విధంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి. బీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి అంటే తెలంగాణ ప్రయోజనాలకు బీఆర్ఎస్ ప్రతినిధి. ఢిల్లీలో తెలంగాణ గొంతుక వినిపించింది మేమే. రాష్ట్ర హక్కుల కోసం ప్రత్యేకంగా కోరేది బీఆర్ఎస్. తెలంగాణ పేరు చెబితే కేసీఆర్ గుర్తుకు వస్తారు. తెలంగాణ జెండా, ఎజెండాను కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడూ వినిపించ లేదు. రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. బండి సంజయ్ సీఎం రేవంత్ ను విమర్శిస్తున్నారు. గతంలో మాదిరిగానే ఇద్దరూ కలిసినట్లే కనిపిస్తోంది.ఢిల్లీలో తెలంగాణ బలాన్ని పెంచుకుందాం. బీజేపీ అడుగడుగునా అవమానించింది. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. బీజేపీది మత విద్వేషం తప్ప మంచి పని చేసింది లేదు. మోదీని ఎదిరించే నేత దేశంలో కేసీఆర్ మాత్రమే. బీజేపీ అభ్యర్థులను బీఆర్ఎస్ మాత్రమే ఓడించింది. కిషన్ రెడ్డి మా దెబ్బకు భయపడి అంబర్ పేట లో పోటీ చేయలేదు.

- Advertisement -

కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
కార్యకర్తల అభిప్రాయం మేరకు అభ్యర్థులను ప్రకటిస్తాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం.కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటాం. మాకు రెండు పార్టీలతో పోటీ ఉంటుంది. పార్లమెంట్ స్థానాలు పరిగణనలోకి తీసుకుంటే 7 స్థానాల్లో మేము ముందున్నాం. కాళేశ్వరంపై ఎవరైనా విచారణ చేసుకోవచ్చు. బీఆర్ఎస్ ఓడిపోతుందని, కేసీఆర్ దిగిపోతారని అనుకోలేదని గ్రామాల్లో అనుకుంటున్నారు. 1.82 శాతం ఓట్ల తేడాతోనే మనం ఓడిపోయాం. చిన్నపాటి లోటుపాట్లు సవరించుకుంటే బాగుండేదని చెప్పారు.కేసీఆర్ సీఎంగా లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పుస్తక రూపంలో కార్యకర్తలకు ఇచ్చాం. కాంగ్రెస్ అడ్డగోలు హామీలపై బీఆర్ఎస్ బుక్ లెట్. తెలంగాణ ప్రయోజనాలకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవు. కేసీఆర్ కు బలం ఇద్దాం. తెలంగాణ గళం వినిపిద్దాం” అని కేటీఆర్ అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు