సారు రూటే సపరేటు..
ఎప్పుడూ ఏమి చేయాలో సారుకు బాగా తెలుసు..
సమ్మె చేస్తే కానీ సారు క్రమబద్దీకరణ చెయ్యడు..
మొన్న విఆర్ఏలను క్రమబద్దీకరణ చేశాడు..
నిన్న కార్యదర్శులను క్రమబద్దీకరణ చేశాడు..
రేపు గిరిజనులకు పోడు భూముల
పట్టాలు పంచుడు అంటుండు..
ఎలక్షన్ వచ్చిందా నిరుద్యోగులకు ఉద్యోగాలంటాడు..
ఇగ ఇచ్చిన హామీలు అన్ని నేరవేర్చాము..
ఇప్పుడు దేశాన్ని ఉద్ధరించడం మన వంతు అంటాడు
పిచ్చి జనాలు మళ్ళీ సంకలు గుద్దుకుంటూ..
సారుకే మా ఓటు అంటారు..
కారు జోరు తగ్గేదేలే అంటారు…
- ప్రవీణ్