Wednesday, April 24, 2024

అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టు…

తప్పక చదవండి

అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టు…
ఈమధ్య బిఆర్ఎస్ కార్యకర్తలు,
సర్పంచులు, కొందరు ఉద్యోగస్తులు కూడా
రిపోర్టర్ల అవతారమెత్తుతున్నారు..
మీటింగ్ లలో కండువా వేసుకుంటారు..
రోడ్డుమీదికొచ్చి రిపోర్టర్ ను అంటారు…
ఈ మధ్య కొన్ని పత్రిక యాజమాన్యాలకు
తోడెం దుడ్లు ఇస్తే చాలు వాడు కార్యకర్తనా,
సర్పంచా, ఉద్యోగా అని ఏం తెలుసుకోకుండానే
ఐడి కార్డులు ఇచ్చి జనంలోకి వదిలేస్తున్నారు.
వీళ్ళని చూసి రిపోర్టర్ అని చెప్పుకోవాలంటే
నిజమైన జర్నలిస్టులు సిగ్గుతో
చచ్చిపోతున్నారు..

  • నాగిరెడ్డి మర్రి
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు