- కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కాంగ్రెస్ మహబూబ్నగర్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ : పాలమూరులో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి యన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్ నగర్ ఎంఎస్ కళాశాలలో విద్యార్థులకు యువతీ యువకులకు 100కోట్లతో స్కీం డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. బాసర త్రిబుల్ ఐటీ తరహా మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలోనూ అండర్ డ్రైనేజీ వ్యవస్థ చిరు వ్యాపారస్తులకు పై బజార్ రద్దు చేయడం మార్కెట్ యార్డులను మహిళలకు పురుషులకు వేరువేరు కమ్యూనిటీ సెంటర్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తూ భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తామని పేర్కొన్నారు. మాజీ సైనికులకు పోలీసు ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులకు 5 ఎకరాలు స్థలాన్ని కేటాయించి శిక్షణ సెంటర్ ను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తామన్నారు. వీరన్న పేటలో పట్టణానికి దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిష్కరిస్తామని సమాచారం పరిష్కరిస్తున్నారు. న్యాయవాదులకు మాజీ సైనికులకు జర్నలిస్టులకు అండగా ఉంటామని వారికి సొంతింటి కల నెరవేర్చటానికి కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య సిసి రోడ్ల నిర్మాణం సానిటేషన్ వంటి సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామన్నారు. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ స్మశాన వాటికలను ఏర్పాటు చేసి సొంత స్థలాలకు కేటాయిస్తామన్నారు. నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయడానికి తాము ఉదయించేతో ఉన్నామన్నారు. మాజీ సైనికులు రిపేరు ఉద్యోగులు మహిళల గ్రీన్ బెడ్జి ఏర్పాటు చేసి ప్రతి కాలనీ ప్రజలకు చైతన్య పరచటానికి విద్యా వైద్యం మొక్కల సంరక్షణ పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు మతసామరస్యానికి ప్రతీకగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఐక్యత ఐక్యమత్యంతో కలియుండేటట్లు చేస్తామన్నారు. నియోజకవర్గం లో ఎవరు వ్యాపారం చేసిన స్వేచ్ఛ నిర్వహించుకోవచ్చు అని మీ వ్యాపార విషయాలతో ఎవరికీ ప్రమేయం లేకుండా మధ్యవర్తులను దళారీల వ్యవస్థను నిర్మూలిగిస్తామన్నారు. ఎవరికి సమస్య వచ్చినా ఆమె స్వయంగా నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యెన్నం శ్రీనివాసరెడ్డికి అత్యధిక మెజార్టీతో చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మేనిఫెస్టో తప్పకుండా పాటిస్తామని స్థానిక ఎల్లమ్మ గుడిలో బాండ్ పేపర్ రాసి ఇచ్చి ఎల్లమ్మ దేవి దేవత అనుగ్రహంతో ప్రమాణ స్వీకారం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ పి వెంకటేష్, రాజేందర్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు సిరాజ్ కాద్రి, లక్ష్మణ్ యాదవ్, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు