Friday, March 29, 2024

ఎల్బీనగర్ జర్నలిస్టులందరికీ అండగా ఉంటా ..

తప్పక చదవండి

గురువారం రోజు ఉదయం ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ జె ఏ సి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం బీ.ఆర్.ఎస్. పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ని బిఎన్ రెడ్డి నగర్ కాలనీలోని వారి నివాసంలో కలిసి, నియోజకవర్గం పరిధిలోని అందరు జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు మంజూరు చేయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ విషయం పై రామ్మోహన్ గౌడ్ స్పందిస్తూ.. ఎల్బీనగర్ నియోజకవర్గంనకు చెందిన అందరు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయించుట కొరకై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ శాఖా మంత్రి కె సి ఆర్ దృష్టికి తీసుకెళ్ళి మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సామ రమణా రెడ్డి, జిన్నారం విఠల్ రెడ్డి, ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్, కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం మాజీ చైర్మన్, కోతి నర్సి రెడ్డి, మాజీ కౌన్సిలర్లు పులిపాటి త్రివేది, కందికంటి ప్రేమ్ నాథ్ గౌడ్, నాగోల్ డివిజన్ బీ.ఆర్.ఎస్. పార్టీ మాజీ అధ్యక్షులు పంగ శ్యామ్ కుమార్, చైతన్యపురి డివిజన్ బీ.ఆర్.ఎస్. పార్టీ మాజీ అధ్యక్షులు పవన్ కుమార్, గడ్డిఅన్నారాం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కత్తుల రాంబాబు, కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం మాజీ డైరెక్టర్లు ఏ. భూపేష్ రెడ్డి , గిరియాదవ్, బింగి రాంబాబు, భవాని శంకర్ గౌడ్, సంతోష్, కొప్పుల వెంకట రెడ్డి, అరుణ్ బాబు యాదవ్, హరిప్రసాద్, బాలరాజు, నరసింహా గౌడ్, మదన్ గౌడ్, బాలు నాయక్ , భాస్కర్ గుప్తా, రఘు, సుమన్, బాబా యాదవ్, ఎర్ర గిరిబాబు, యం ఎస్ కుమార్, దత్తు, కృష్ణ గౌడ్, ప్రశాంత్, స్వామి, శేఖర్, యాది ముదిరాజ్, శివ, మల్లేష్ యాదయ్య, రాజు, రాజశేఖర్, శ్రవణ్, రామలక్ష్మణ్, దర్వేష్ ఖాన్, హుస్సేన్ యాదవ్, వెంకటేష్, శ్రీనివాస్, గోవర్ధన్, చిన్నయాదవ్, చిన్న గౌడ్, ఈశ్వర్, సుదర్శన్ రెడ్డి, రమణా రెడ్డి, సుధాకర్, గట్టు శ్రీనివాస్, వీరన్న యాదవ్, తిరుమల రెడ్డి, ప్రహ్లాద్, నాగరాజు ముదిరాజ్, సాయి, నాని, వంశీ, అభి, సతీష్, మోహన్ తదితరులున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు