Friday, March 29, 2024

దుర్గా వాహిని ఆధ్వర్యంలో “కేరళ స్టోరీ” ప్రదర్శన

తప్పక చదవండి
  • భారతీయ కుటుంబ ఔన్నత్యాన్ని చాటి చెబుతామని దుర్గా వాహిని ప్రతిజ్ఞ

హైదరాబాద్ : హిందూ ధర్మంపై ప్రముఖంగా హిందూ యువతులపై జరుగుతున్న దాడి.. దౌర్జన్యాన్ని ఎదుర్కొనేందుకు యువతులు సిద్ధంగా ఉండాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ పేర్కొన్నారు. లవ్ జిహాద్ వల్ల దాదాపు 50 వేల మంది యువతులు ఒక కేరళ రాష్ట్రం నుంచే మిస్సింగ్ అయ్యారని.. అయితే అందుకు ప్రభుత్వ సహకారంతో కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. ప్రతి యువతి ది కేరళ స్టోరీ సినిమా చూసి తనను తాను కాపాడుకోవాలని సూచించారు. భాగ్యనగర్ అత్తాపూర్ లోని మంత్ర ఫ్లెక్సీలో దుర్గా వాహిని ఆధ్వర్యంలో 150 మంది యువతులు ది కేరళ స్టోరీ సినిమా చూశారు.

దేశం కోసం.. ధర్మం కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ :
సినిమా హాల్లో దుర్గవాహిని ఆధ్వర్యంలో యువతులు ప్రమాణం చేశారు. భారతీయ జీవన విధానాన్ని అవలంభిస్తూ.. కుటుంబ ఔన్నత్వాన్ని చాటు చెబుతానని.. అందుకు నన్ను నేను సనాతన ధర్మం వారధిగా నిర్మించుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. ధర్మం కోసం.. దేశం కోసం ధైర్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై అనే నినాదాలతో హోరెత్తించారు. ప్రతిరోజు దుర్గా వాహిని ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాలలో ది కేరళ స్టోరీ సినిమా చూపిస్తున్నారు. అందుకు దాతలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయం. విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, దుర్గా వాహిని ప్రాంత ప్రముఖ్ శ్రీమతి వాణి సక్కుబాయి, బజరంగ్ దళ్ ప్రాంత ప్రముఖ్ శివరాములు, దుర్గా వాహిని నాయకురాలు సంకల్ప, నాగ సీత, పద్మ, బజరంగ్ దళ్ కార్యకర్తలు సమన్వయం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు