Monday, May 13, 2024

కొల్లూర్ గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో స్థానిక పేద ప్రజలకు 50 శాతం ఇవ్వాలి : కాట శ్రీనివాస్ గౌడ్

తప్పక చదవండి

హైదరాబాద్, తెల్లాపూర్ మున్సిపాలిటీ, కొల్లూర్ గ్రామంలోని డబల్ బెడ్ రూమ్స్ ఇండ్ల వద్ద నిర్వహించిన ప్రెస్ మీట్ లో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కొల్లూర్ గ్రామంలోని డబల్ బెడ్ రూమ్ ఇండ్లు స్థానిక పేద ప్రజలకు 50 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.. సీఎం కేసీఆర్ కొల్లూర్ గ్రామంలోని డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ఓపెనింగ్ కు విచ్చేస్తున్న సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ మయూరి రాజు గౌడ్, రాంసింగ్ నాయక్ లకు ముందుగా అపాయింట్మెంట్ ఇచ్చి, పాసులు కూడా అందజేసినప్పటికీ సీఎంని కలవనీయకుండ.. వారిని ముందస్తు హౌస్ అరెస్ట్ చేసి అవమానించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కౌన్సిలర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ శ్రీకాంత్ రెడ్డి, మండల్ ప్రెసిడెంట్స్ సుధాకర్ గౌడ్, వడ్డె క్రిష్ణ, అశోక్, నర్సింగ్ రావు, ఎంపీపీ రవీందర్ గౌడ్, ఎంపీటీసీలు నరేందర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, కార్పొరేషన్ డివిజన్ ప్రెసిడెంట్స్ ఈశ్వర్ సింగ్, శ్రీనివాస్, మున్సిపాలిటీ ప్రెసిడెంట్స్ ఎల్. రవీందర్, శశిధర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, కౌన్సిలర్స్ రెడ్డి సరితా రెడ్డి, పావని రవీందర్, మైనారిటీ ప్రెసిడెంట్ హబీబ్ జానీ, నాయకులు శ్యామ్ రావు, వీరారెడ్డి, శ్రీహరి, యాదగిరి, వెంకట్ గౌడ్, శ్రీనివాస్, వాజీద్, నవారి శ్రీనివాస్ రెడ్డి, తెల్లాపూర్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాయినాథ్ రెడ్డి, తెల్లాపూర్ సోషల్ మీడియా ప్రెసిడెంట్ ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కె ఎస్ జి యువసేన సభ్యులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు