Sunday, April 28, 2024

రేవంత్ రెడ్డి .. నీది నోరా మోరా ? బీజేపీ కోవర్ట్.. రేవంత్ రెడ్డి: డా. దాసోజు శ్రవణ్

తప్పక చదవండి

- Advertisement -

‘చిల్లర మాటలకు, అవాకులు చావాకులకు, నిరాధారమైన మాటలకు మారుపేరుగా మారిన రేవంత్ రెడ్డి.. కేసీఅర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధిని ఓర్వలేక మరోసారి చిల్లరమల్లర మాటలకు పాల్పడ్డారు. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కోసం సాధికారత కలిగిన నాయకుడిగా కేంద్రమంత్రులని కలవడానికి వెళితే.. ఒక ఎంపీగా, ప్రతిపక్ష నాయకుడిగా స్వాగతించాల్సింది పోయి అవాకులు చావాకులు మాట్లాడుతూ చిల్లర రాజకీయాలకు పాల్పపడుతున్నారు రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష నాయకుడిగా కనీస భాద్యత లేకుండా సిగ్గుఎగ్గు లేకుండా అడ్డదిడ్డమైన మాటలు మాట్లడుతున్నారు. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన అన్నట్లుగా 125 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక రాజకీయ పార్టీకి రాష్ట్ర అద్యక్షుడిగా వుండి చిల్లర మాటలడుతున్న రేవంత్ రెడ్డి.. నీది నోరా.. మోరా ‘’ అని ప్రశ్నించారు బిఆర్ఎస్ నాయకులు డా. దాసోజు శ్రవణ్. తెలంగాణా మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు సమాధానం ఇస్తూ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు దాసోజు శ్రవణ్.

ఈ మీడియా సమావేశంలో డా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. కేటీఆర్ గారు భాద్యత గల మంత్రిగా తెలంగాణ అభివృద్ధి కోసం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్ర మంత్రులని కలిస్తే కేసుల కోసం వెళ్ళారని చిల్లర ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తో కలసి కేంద్రమంత్రులని ఎందుకు కలిశారు ? దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, గతంలో మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్, హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్.. ఎలా ఎంతోమంది నరేంద్ర మోడీని కలిశారు. వీళ్ళంతా కేసులు కోసం కలిసినట్లేనా ? అసలు రాజకీయాలు, వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ఎలా పని చేస్తామో రేవంత్ రెడ్డికి అవగాహన ఉందా ? అని ప్రశ్నించారు.

కేంద్రం తెలంగాణకు సహకరించడం లేదు, రావాల్సిన నిధులు ఇవ్వడం లేదు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలు ప్రాజెక్ట్స్ కి జాతీయహోదా ఇవ్వడం లేదు. ఐటీఆర్ లాంటి ప్రాజెక్ట్స్ రాకుండా చేస్తున్నారు. ఇలా కేంద్ర బిజెపి తెలంగాణ అస్థిత్వం, నాయకత్వం, అభివృద్ధి పై దాడి చేస్తుంటే భాద్యత గల ప్రతి పక్షంగా మదత్తు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ అడ్డమైన కూతలు కోయడానికి రేవంత్ రెడ్డి నోరెలా వచ్చింది? అని ప్రశ్నించారు .

కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్లి.. మియాపూర్ నుంచి హయత్ నగర్ వరకూ మెట్రో రైల్ కావాలని కోరితే అది కుమ్మక్కు రాజకీయమా ? ఎయిర్ పోర్ట్ కు ఎక్స్ ప్రెస్ మెట్రో కావాలని కోరడం కుమ్మక్కు రాజకీయమా ? వరంగల్ కు మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం అడిగితే అది కుమ్మక్కు రాజకీయమా ? తెలంగాణ పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని అడిగితే అడికుమ్మక్కు రాజకీయమా ? వరి కొనుగోళ్ళ కోటాను తెలంగాణకు పెంచండని కోరడం కుమ్మక్కు రాజకీయమా? అని ప్రశ్నించిన దాసోజు.. రేవంత్ రెడ్డి తన చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలి’’ సూచించారు.

‘రేవంత్ రెడ్డి ఫెడరల్ స్ఫూర్తిని అర్ధం చేసుకోవాలి. రేవంత్ కు చిల్లర మాటలు పసలేని ఆరోపణలు తప్ప, విలువలతో కూడిన రాజకీయాలు తెలియవు. కేంద్ర రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం వుంటుంది. మంత్రిగా. భాద్యతతో కేటీఆర్ గారు తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులని కలిస్తే.. రేవంత్ రెడ్డి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు దాసోజు.

రేవంత్ రెడ్డి కోవర్ట్ గ మారి గంపగుత్తగా బిజేపీతో కుమ్మక్కయ్యారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అద్యక్షుడైన తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాల సరళిని గమనిస్తే ఇది తెలుస్తుంది. దుబ్బాక ఎన్నికల్లో బిజెపి గెలిచింది. ఆయన ఒక మండలానికి ఇన్ఛార్జ్ గా చేశారు. అక్కడ బిజెపి కి ఎన్ని ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ కి ఎన్ని ఓట్లు వచ్చాయో డాటా చూస్తే తెలుస్తుంది. అలాగే హుజురాబాద్ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. కాంగ్రెస్ ఓట్లని బిజెపికి మళ్లించారు రేవంత్ రెడ్డి. ఆయన మల్కాజ్ గిరి లో రెండు కంటే ఎక్కువ కార్పోరేట్ సీట్లు కాంగ్రెస్ కి రాలేదు. రేవంత్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఓట్లు ఎందుకు బిజెపి వెళుతున్నాయి ? ఇది కుమ్మక్కు రాజకీయం కాదా ? అని ప్రజలు అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి కుమ్మక్కు రాజకీయాన్ని కాంగ్రెస్ కూడా అర్ధం చేసుకోవాలి.

చంద్రబాబు తొత్తు రేవంత్ రెడ్డి.. ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గా మార్చేశాడు. చంద్రబాబు చెప్పుచేతుల్లో గాంధీ భవన్ ని నడుపుతూ తెలంగాణ అస్తిత్వం మీద కక్ష పెంచుకొని తెలంగాణ అభివృద్ధికి కంటకులుగా మారారు’’ అని విమర్శించారు.

‘తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయలని గుర్తించాలి. తెలంగాణ సమాజాన్ని ఎంత గంధరగోళం చేయాలని ప్రయత్నించినా తెలంగాణ ప్రజలు ఇలాంటి చిల్లర రాజకీయాని తిప్పికొడతారు. కే సీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు’ అని పేర్కొన్నారు దాసోజు .

ఈ మీడియా సమావేశంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం జనరల్ సెక్రెటరీ రూప్ సింగ్, కట్టెల శ్రీనివాస్ యాదవ్ తదితర బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు