Friday, April 26, 2024

మే 25న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు..

తప్పక చదవండి
  • రంగం సిద్ధం చేసిన ఎంసెట్ కన్వీనర్..
  • ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోండి..
  • ఫలితాలు విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి సబితా..

హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణ ఎంసెట్- 2023 ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. మే 25వ తేదీన ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్నట్లు ఎంసెట్ క‌న్వీన‌ర్ ప్రక‌టించారు. మే 25వ తేదీన ఉద‌యం 11 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేస్తార‌ని తెలిపారు. హైదరాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్‌టీయూ క్యాంప‌స్‌లోని గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్‌లో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారని వెల్లడించారు. ఎంసెట్ అగ్రిక‌ల్చర్, మెడిక‌ల్, ఇంజినీరింగ్ కోర్సుల‌కు సంబంధించిన ఫ‌లితాల ర్యాంకుల‌ను, మార్కుల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ ఫలితాలను ఎంసెట్ హాల్ టికెట్ నంబ‌ర్ ద్వారా తెలుసుకోవ‌చ్చని తెలిపారు. ఇక మెడిక‌ల్, అగ్రిక‌ల్చర్, ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంక‌ర్ల వివ‌రాల‌ను కూడా ఆ రోజే(మే 25) వెల్లడించ‌నున్నారు. ఎంసెట్ ఫ‌లితాల కోసం eamcet.tsche.ac.in అనే వెబ్‌సైట్లను లాగిన్ అవొచ్చని చెప్పారు.

ఫలితాలను చెక్ చేసుకునే విధానం :
అభ్యర్థులు //https://eamcet.tsche.ac.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.. హోం పేజీలో టీఎస్ ఈసెట్ రిజల్ట్స్ 2022 (TS ECET Results 2022) సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి SUBMIT పై క్లిక్ చేయాలి.. తర్వాత మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ కాపీని ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు