Friday, March 29, 2024

జూన్ 9 న చేపమందు పంపిణీ..

తప్పక చదవండి
  • ఉదయం 8 నుండి 24 గంటలపాటు నిరంతరంగా..
  • నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కార్యక్రమం..
  • మంత్రి తలసానితో భేటీ అయిన బత్తిని సోదరులు..
  • అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ..

హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ తేది ఖరారు చేశారు బత్తిన సోదరులు. జూన్ 9న ఉదయం 8 గంటల నుంచి 24 గంటల పాటు నిరంతరంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు బత్తిన అమర్నాథ్ గౌడ్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో మే 23వ తేదీ మంగళవారం సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో బత్తిన సోదరులు భేటీ అయ్యారు. చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తామని తలసాని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారాయన. చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి లక్షలాది మంది వస్తారన తలసాని..ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. ఇందుకు అవసరమైన చేప పిల్లలను రాష్ట్ర మత్స్య శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ నెల 25న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు.

ప్రసాదం కోసం వచ్చేవారు నాలుగు గంటల ముందు నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకూడదని సూచించారు. ప్రసాదం తీసుకున్న అనంతరం రెండు గంటల పాటు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవద్దని తెలిపారు. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా అస్తమా బాధితులకు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తారు బత్తిన సోదరలు.అయితే కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ మూడేళ్లుగా నిలిచిపోయింది. ఈ ఏడాది నుంచి చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఎప్పటిలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బత్తిన సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉబ్బసం వ్యాధి గ్రస్తులు హైదరాబాద్ కు వస్తుంటారు. బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదం కోసం జనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతారు. కరోనా తర్వాత తొలిసారి చేప ప్రసాదం పంపిణీ కావడంతో ఈ సారి జనం భారీగా తరలి రానున్నారని అంచనా వేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు