Friday, May 17, 2024

నూత‌న ప్ర‌భుత్వంలో డ‌బ్ల్యూటీఐటీసికి స‌ముచిత ప్రాధాన్యం

తప్పక చదవండి
  • చైర్మ‌న్ సందీప్ మ‌ఖ్త‌ల సూచ‌న‌లు స్వీక‌రిస్తామ‌న్న ఐటీ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు
  • డ‌బ్ల్యూటీఐటీసి అరైవ‌ల్ స‌మిట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న‌ మంత్రి
  • ఉద్య‌మంలో, ఐటీ ప‌రిశ్ర‌మ‌ అభివృద్ధిలో భాగమ‌య్యారంటూ సందీప్ పై ప్ర‌శంస‌లు

హైదరాబాద్ :- ప్ర‌జా ప్ర‌భుత్వం ఎజెండాతో ముందుకు సాగుతున్న త‌మ పాల‌న‌లో వ‌రల్డ్ తెలుగు ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాలజీ కౌన్సిల్ (డ‌బ్ల్యూటీఐటీసీ) మ‌రియు తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) ల‌కు స‌ముచిత ప్రాధాన్యం క‌ల్పిస్తామ‌ని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు తెలిపారు. టీహ‌బ్ వేదిక‌గా నేడు జ‌రిగిన అరైవ‌ల్ స‌మిట్‌కు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మ నేప‌థ్యంతో పాటుగా రాష్ట్రంలో ఐటీ ప‌రిశ్ర‌మ అభివృద్ధిలో త‌న‌వంతు పాత్ర పోషించిన సందీప్ మ‌ఖ్త‌లను అభినందిస్తూ ఆయ‌న‌ సూచ‌న‌ల‌ను నూత‌న ప్ర‌భుత్వంలోనూ స్వీక‌రిస్తామ‌నివెల్ల‌డించారు. దేశంలో హైద‌రాబాద్ నంబ‌ర్ వ‌న్ స్థాయికి ఎదిగేలా కృషి చేస్తామ‌ని తెలిపారు.

ప్ర‌తి ఏడాది ఆరంభంలోని మొద‌టి శుక్ర‌వారాన్ని అరైవ‌ల్ స‌మిట్ పేరుతో డ‌బ్ల్యూటీఐటీసీ & టీటా సంయుక్తంగా నిర్వ‌హిస్తోంది. 2024 అరైవ‌ల్ స‌మిట్ నేడు టీహ‌బ్ వేదిక‌గా చేప‌ట్ట‌గా రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల‌ శ్రీ‌ధ‌ర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయ‌న‌కు డ‌బ్ల్యూటీఐటీసీ చైర్మ‌న్ సందీప్ మ‌ఖ్త‌ల ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఐటీ మంత్రి మాట్లాడుతూ, టీటాతో ఎప్ప‌టి నుంచి అనుబంధం ఉంద‌ని తెలిపారు. టీటా నిర్వ‌హించిన‌ బోనాల జాత‌ర‌లో పాల్గొన్నాన‌ని గుర్తుచేసుకున్నారు. త‌న స్వగ్రామ‌మైన ధ‌న్వాడ‌ను 100% డిజిట‌ల్ గ్రామంగా టీటా తీర్చిదిద్దింద‌ని ఐటీ మంత్రి సంతోషం వ్య‌క్తం చేశారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మం నుంచి హైద‌రాబాద్ ఐటీ ప‌రిశ్ర‌మ అభివృద్ధి వ‌ర‌కూ సందీప్ మ‌ఖ్త‌ల కీల‌క పాత్ర పోషించార‌ని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు ప్ర‌శంసించారు. దాదాపు 14 ఏళ్ల పాటు ఒక సంస్థ‌ను క్ర‌మ‌బ‌ద్దంగా న‌డిపించ‌డం, 42 దేశాల‌కు విస్త‌రించ‌డం గొప్ప చ‌ర్య అని అభినందించారు. సందీప్ కృషి ప్ర‌శంస‌నీయమ‌ని పేర్కొంటూ త‌మ ప్ర‌భుత్వంలో ఐటీ పాల‌సీ రూప‌క‌ల్ప‌న‌లో డ‌బ్ల్యూటీఐటీసీని త‌ప్ప‌కుండా భాగ‌స్వామ్యం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. బెంగ‌ళూరు & హైద‌రాబాద్ న‌గ‌రాల‌ను కంట్రీ క‌జిన్స్ అని కర్ణాట‌క ఐటీ మంత్రి ప్ర‌శంసించ‌డం సంతోష‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్ ఐటీ ప‌రిశ్ర‌మ వృద్ధి కొన‌సాగిస్తామ‌ని, దేశంలో అగ్ర‌గామిగా రూపొందించేందుకు కృషి చేస్తామ‌ని వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా డ‌బ్ల్యూటీఐటీసీ చైర్మ‌న్‌ సందీప్ మ‌ఖ్త‌ల మాట్లాడుతూ :-
త‌మ సంస్థ కార్యాచ‌ర‌ణ‌ను ఐటీ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు గుర్తించ‌డం సంతోష‌క‌ర‌మ‌ని తెలిపారు. మున్ముందు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామ‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వ విధానాల్లో త‌మ‌ను భాగ‌స్వామ్యం చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌ని అన్నారు. ఉద్య‌మంలో పాల్గొన‌డం, త‌దుప‌రి ప్ర‌భుత్వానికి స‌హ‌కరించిన విధంగానే ప్ర‌స్తుత ప్ర‌భుత్వానికి సైతం మ‌ద్ద‌తు కొన‌సాగిస్తామని వెల్ల‌డించారు. ఈ కార్యక్రమంలో టీహ‌బ్ సీఈఓ శ్రీ‌నివాస్ మ‌హంకాళి, శ్రీ‌నివాస్ తాలుక‌, వింగ్ క‌మాండర్‌ అనీష్‌, డ‌బ్ల్యూటీఐటీసీ ముక్య సలహాదారుడు ఈవీ శ్రీ‌నివాస్, స‌తీష్, నెల్లి ప్ర‌స‌న్న‌, మహేశ్ కొనగాలు, ఇలియాస్‌, శ్రీ‌జ ఆకుల‌, నిత్య , ఈశ్వ‌ర్ కొత్త, అమెరికాకు చెందిన ఎస్‌బీఎస్ కార్ప్ క‌ళ్యాణ్ చివ‌కుల‌, వివిధ ఐటీ కంపెనీల‌ సీఈఓలు, ఇండ‌స్ట్రీ పెద్ద‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు