Sunday, May 12, 2024

విజన్ లేని వెల్ విజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్..

తప్పక చదవండి
  • విజన్ పేరు చెప్పుకుని వంచిస్తున్న మాయగాడు..
  • నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా అమాయకపు ప్రజలకు శట గోపం…
  • సీ.ఈ.ఓ. ఎం.డి. శ్రీనివాసరావు కందుల..బురిడీ కొట్టించే
    మాటల మాయల మరాఠీ..
  • వీరి ఆటలు కట్టించకపోతే అమాయకుల జీవితాలే గల్లంతు..
  • నిషేధిత నెట్ వర్క్ మార్కెటింగ్ చేస్తూ నిస్సిగ్గుగా దోపిడీ..

శ్రీనివాసరావు కందుల.. సీ.ఈ.ఓ ఎం.డి. కూకట్ పల్లి, గోకుల్ ప్లాట్స్ 9 వ ఫేజ్, వెంకట రమణ కాలనీ, హోసింగ్ బోర్డు కాలనీ, ప్లాట్ నెంబర్ : 1443, ఓంకార నిలయం కేంద్రంగా వెల్ విజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో అక్రమ పద్ధతిలో నెట్వర్క్ మార్కెటింగ్ నిర్వహిస్తున్నారు.. పదుల సంఖ్యలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా అమాయకులైన ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతూ డబ్బులు సేకరిస్తున్నారు.. మీరు పెట్టుబడులు పెట్టండి మీ డబ్బులు కొద్ది రోజుల్లోనే డబుల్ అవుతాయి.. వెల్ విజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో దుఖాణం నిర్వహణ.. వెల్ విజన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, తక్కువ ధరకు ఫార్మ్ ల్యాండ్ లో ప్లాట్లు విక్రయిస్తాం.. మీరు పెట్టుబడి పెడితే 10 శాతం వడ్డీ కూడా ఇస్తాం.. అంటారు కానీ వీరికి ఎక్కడ కూడా వెంచర్లు.. ల్యాండ్.. లేనేలేదు.. అయినా కూడా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా మేఘన ఫామ్స్ లాండ్స్, మాచాపూర్, వరంగల్ లో ఫార్మ్ లాండ్స్ ఉన్నట్టు కళ్లుచెదిరే బ్రోచర్లు, చందనవల్లి గ్రామం నకిరేకల్ మండలం నల్గొండ జిల్లాలో లేని ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నట్లు, కొండవీడు ప్రక్కన సంక్రాంతి పాడు గ్రామం, నాదెండ్ల మండలం, గుంటూరు జిల్లాలో ఆకర్షణీయమైన హ్యాండౌట్స్ సృష్టించి లేని భూమి ఉన్నట్లుగా అమ్మే ప్రయత్నం. వెల్ విజన్ హోమ్ అప్లయిన్స్ టివి, ఫ్రిడ్జ్, ఏసీ పలు ఎలక్రిట్ గృహోపకరణాలపై వెల్ విజన్ పేరుతో బ్రాండింగ్.. భారీ మొత్తంలో వెల్ విజన్ గోడౌన్స్ నిర్వహించబోతున్నాం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకో గోడౌన్ ప్రారంభించబోతున్నాం. గౌడౌన్ లీజ్ కోసం ప్రాంచైసీ కోసం డబ్బులు పెట్టుబడులు పెట్టండి, 5 నుండి 10 శాతం వడ్డీ రూపంలో చెల్లిస్తాం. వెల్ విజన్ ట్రేడింగ్ ఆన్ లైన్ షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టి, మేము ఒళ్ళు దగ్గరపెట్టుకుని పనిచేసి 200 రోజుల్లో మీ డబ్బును రెట్టింపుచేసి మీకిస్తాం.. వెల్ విజన్ సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం.. పుణ్యం మీకు మూటగట్టి పెడతాం.. వెల్ విజన్ గోట్ ఫార్మింగ్ మేకల, గొర్ల పెంపకం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను తీసుకువచ్చే లాభసాటి వ్యాపారం.. రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులైపోతారు.. తమ మాటలతో సామాన్య ప్రజానీకాన్ని కళ్ళముందే పేదవాన్ని కోటీశ్వరున్ని చేస్తారు.. కూకట్ పల్లి గోకుల్ ప్లాట్స్ 9వ ఫేస్ లో టివిలు, ఫ్రిడ్జ్ లు గృహోపకరణాల వ్యాపారం నిర్వహించే దుఖాణం నష్టాలు రావడంతో గొలుసుకట్టు వ్యాపారాన్ని తెరమీదకు తీసుకుని వచ్చింది.. సామాన్య ప్రజలకు టివి, ఫ్రిడ్జ్ లాంటి గిఫ్టులు ఎరజూపి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించింది.. ఈ నెట్ వర్కింగ్ మార్కెటింగ్ అంటేనే మోసం.. ఈ మోసపూరిత వ్యాపారాన్ని నిర్వహిస్తూ.. ఎప్పుడు బిచాణా ఎత్తేస్తుందో.. ఆ ప్రభువుకే ఎరుక..

మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ దందా అమాయకులను అప్పులపాలు చేస్తోంది. రాష్ట్ర పోలీసులు పట్టుకున్న కేసుల్లో రూ.20 వేల కోట్ల మేర మల్టీలెవల్‌ మార్కెటింగ్‌లో వేలాదిమంది మోసపోవడం సంచలనం రేపుతోంది. దేశవ్యాప్తంగా మల్టీలెవల్‌ మార్కెటింగ్‌పై నిషేధం విధిస్తూ కేంద్రం 1978లోనే చట్టాన్ని తీసుకువచ్చింది. మనీ సర్క్యులేషన్‌ స్కీం నిషేధిత యాక్ట్‌ కింద గిఫ్ట్‌ల పేరిట డబ్బులు వసూలు చేసి చెయిన్‌ లింక్‌ ద్వారా మార్కెటింగ్‌ చేయడం పూర్తిగా అక్రమమేనని ఈ చట్టం ద్వారా స్పష్టం చేసింది ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో ఆమ్వే ప్రాడక్ట్‌పై ఇదే తరహా మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ కేసును సీఐడీ నమోదు చేసింది. ఇటీవల బయటపడుతున్న మల్టీలెవల్‌ కంపెనీ మోసాలు వేలకోట్లకు చేరడంతో రాష్ట్రంలో మళ్లీ మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మాఫియా చాపకింద నీరులా దందా సాగిస్తున్నట్టు స్పష్టమవుతోంది.

- Advertisement -

శ్రీనివాసరావు కందుల.. సీ.ఈ.ఓ ఎం.డి, బురిడీ కొట్టించే మాటలు గారడి…
శ్రీనివాసరావు కందుల తన విశేషమైన పరిజ్ఞానంతో ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు గడ్డిని కూడా లక్షల్లో అమ్మేస్తామని మాటల గారడీతో అమాయకులైన ప్రజలను బుట్టలో వేసుకొని కోట్లు మూట కట్టుకున్నాడు.. ఎప్పుడు దుఖాణం ఎత్తేస్తాడో ఆ ప్రభువుకి ఎరుక.. పోలీసు నిఘా వ్యవస్థలు ప్రత్యేక దృష్టి సారించి ఈ చీకటి వ్యాపారాన్ని తొందర్లోనే మూసేయాలని, సామాన్యులైన ప్రజలను కాపాడాలని స్థానిక ప్రజానికం కోరుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు