Monday, April 29, 2024

ఎవ‌రికోసం.. ఎందుకోసం..?

తప్పక చదవండి
  • ఓ అధికారిని కోసం వ‌రంగ‌ల్ ఆర్జేడీ కార్యాల‌యం తరలింపు
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న జూనియర్ లెక్చరర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్
  • వరంగల్ ఆర్జేడీ ఆఫీసు హైదరాబాద్ లో కొనసాగడంపై మండిపాటు
  • బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అప్పటి ఇంటర్ బోర్డు కమిషనర్ నిర్ణయంపై ఆగ్రహం
  • కొత్త సర్కార్ తమకు న్యాయం చేయాలని లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది వేడుకోలు

జనరల్ గా ఓ బడిని రేషనలైజేషన్ చేయాలన్న, ఓ పీహెచ్సీని మార్చాలన్నా.. చివరకు ఓ అంగన్ వాడి సెంటర్ ను బైఫర్కేషన్ చేయాలన్నా.. అధికారులు సవాలక్ష రూల్స్ పాటిస్తుంటారు. ఆయా శాఖలు అనేక నిబంధనలనూ అమలు చేస్తుంటాయి. కానీ, బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అప్పటి ఇంటర్ బోర్డ్ కమిషనర్ నవీన్ మిట్టల్ మాత్రం ఇవేవీ పాటించకుండా ఏకంగా వరంగల్ ఆర్జేడీ ఆఫీసునే (జోన్‌-1) హైదరాబాద్ (జోన్‌-2) కు తరలించడం విస్మయానికి గురిచేస్తోంది. అంతే కాకుండా జోన్ -2 అధికారిని ఆర్జేడీగా నియ‌మించ‌డం జ‌రిగింది. అదీ ఓ అధికారిని కోసం ఆర్జేడీ కార్యాలయాన్ని హైదరాబాద్ కు మార్చేయడం ఆశ్చర్యం కల్గిస్తోంది. నవీన్ మిట్టల్, ఆ అధికారిని చేసిన దిక్కుమాలిన పనితో ఇప్పుడు వెయ్యికిపైగా జూనియర్ లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

రాష్ట్ర ఇంటర్ బోర్డులోని ఆర్జేడీల పాత్ర అత్యంత కీలకమనే విషయం తెలిసిందే. జూనియర్ లెక్చరర్లు, నాన్ టీచింగ్ కు సంబంధించిన అనేక పనులు ఆర్జేడీల పరిధిలోనే ఉంటాయి. తెలంగాణలో ప్రస్తుతం రెండు ఆర్జేడీ కార్యాలయాలు నడుస్తున్నాయి. ఇందులో ఒకటి హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తుండగా.. ఇంకొటి 25 ఏళ్ల క్రితం వరంగల్ లో స్థాపించారు. అయితే హైదరాబాద్ ఆర్జేడీ రాజధానిలోనే కొనసాగుతుండగా.. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వరంగల్ ఆర్జేడీ కార్యాలయాన్ని సైతం అప్పటి ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాద్ కు తరలించడం విశేషం. అంతేకాక అలా తరలించిన వరంగల్ ఆర్జేడీ ఆఫీసు కార్యకలాపాలు రాష్ట్ర రాజధానిలోనే కొనసాగేలా ప్ర‌స్తుత ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడం మరీ చిత్రంగా ఉంది. వాస్తవానికి అప్పట్లో నవీన్ మిట్టల్ వరంగల్ ఆర్జేడీ కార్యాల‌యం ఓ అధికారిని సౌకర్యార్థమే హైదరాబాద్ కు మార్చేసినట్లు తెలుస్తోంది. విద్యా శాఖలో అత్యంత కీలకమైన ఇలాంటి నిర్ణయాన్ని అంత సింపుల్ గా తీసుకోవడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నవీన్ మిట్టల్ కు ఆ అధికారినికి మధ్యనున్న ఆర్థిక లావాదేవీల వంటి వ్యవహారాల కారణంగానే అప్పట్లో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే ప్రచారముంది.

- Advertisement -

వాస్తవానికి ఉత్తర తెలంగాణ జిల్లాల ఇంటర్మీడియట్ సిబ్బందికి ఆర్జేడీ వరంగల్ లోనే ఉంటే వారికి సౌలభ్యంగా ఉంటుంది. అలా అయితేనే వరంగల్‌, ఖమ్మం, కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, ములుగు, నిర్మల్‌, కరీంనగర్‌ జిల్లాల ఉద్యోగులకు ఆర్జేడీ కార్యాలయం అందుబాటులో ఉండే అవకాశముంది. జూనియర్ లెక్చరర్లు, పీడీలు, లైబ్రెయిన్‌లు, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఓరుగల్లు అయితే వారు ఈజీగా తమ కాార్యకలాపాలను నిర్వహించుకునేందుకు అవకాశముంటుంది. వరంగల్ లోనే ఆర్జేడీ కార్యాలయం ఉండడం వల్ల గత 25 ఏళ్ల నుంచి వీరికి ఇబ్బందులు తలెత్తలేదు. కానీ, బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పాత కమిషనర్ నవీన్ మిట్టల్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు.. జూనియర్ లెక్చరర్లు, నాన్ టీచింగ్, ఇతర సిబ్బంది హైదరాబాద్ వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయినా ఆర్జేడీ స్థాయి కార్యాలయాన్ని వరంగల్ నుంచి హైదరాబాద్ కు తరలించడంపైనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతేకాక తాజాగా వరంగల్ ఆర్జేడీ కార్యాలయ సిబ్బందిని, కార్యాల‌యానికి కేటాయించిన నిధుల మొత్తం హైదరాబాద్ ఆఫీసుకు కేటాయిస్తూ ఈనెలలోనే ఉత్తర్వులు రావడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈనేపథ్యంలోనే వరంగల్ ఆర్జేడీ పరిధిలోని జూనియర్ లెక్చరర్లు, పీడీలు, లైబ్రెయిన్‌లు, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఇలాంటి ఉత్తర్వులను వెంటనే వెనక్కు తీసుకోవాలని.. తిరిగి ఎప్పటిలాగే వరంగల్ ఆర్జేడీ ఆఫీసును ఓరుగల్లులోనే పునరుద్దరించి ఇక్కడి నుంచే కార్యకలాపాలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వేడుకుంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు