Sunday, April 28, 2024

సారూ…సహకారశాఖ ఉద్యోగులకు బదిలీలు ఉండవా?

తప్పక చదవండి
  • సంవత్సరాలుగా ఓకే వద్ద పాతుకుపోయిన ఉద్యోగులు.
  • అన్ని శాఖలకు వర్తించే బదిలీ నిబంధనలకు వీరు అతీతులా?.
  • ఇలాగైతే అక్రమాలు జరగవా.?
  • ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న రైతులు.

రైతులు ఆర్థికంగా పరిపుష్టి సాధించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఏర్పడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఓకే శాఖలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగుల కారణంగా అక్రమాలకు నెలవుగా మారుతున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖలలో 3,5 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర స్థానాలకు బదిలీ చేస్తుండగా సహకార శాఖలో మాత్రం 5 నుంచి 15 సంవత్సరాలుగా బదిలీలు లేక, సొంత జిల్లాలో, సొంత ఊర్లలో ఉద్యోగులు పాతుకుపోయారు. దీంతో స్థాన బలం తో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు.తనిఖీలు చేపట్టి, సహకార సంఘాలలో అక్రమాలను వెలికి తీసి, సంఘాలను ప్రక్షాళన చేయాల్సినఅవసరం పై అధికారులకు లేదా ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఒకే చోట పాతుకుపోయి సంఘాల అధ్యక్షులతో,సంఘాల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో సత్సంబంధాలు నెలకొల్పుకొని, లాలూచీ పడుతూ సంఘాల్లో జరిగే అక్రమాలను అవినీతిని చూసిచూడనట్టు వ్యవహారిస్తున్నారు.దాంతో సంఘాలలో కోట్లాది రూపాయల దుర్వినియోగం జరుగుతుంది కదా?. అన్ని శాఖల ఉద్యోగులకు వర్తించే బదిలీ నిబంధనలకు వీరు మాత్రం అతీతులా అని స్థానికంగా వుండే రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఇతర శాఖలకు ఒక రూల్..వీరికి ఒక రూలా?
2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ మధ్య అన్ని శాఖలలో, ముఖ్యంగా ఎన్నికల విధులతో సంబంధం ఉండే శాఖలు రెవిన్యూ, పోలీస్, ఎక్సైజ్, పంచాయతీరాజ్ శాఖలలో మూడేళ్లు,ఐదేళ్లు పైబడి ఒకే చోట పని చేస్తున్న వారిని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తప్పనిసరిగా బదిలీ చేసినారు.చేస్తున్నారు.
కానీ సహకార శాఖలో మాత్రం 15 సంవత్సరాలుగా బదిలీలు అసలే జరగడం లేదు. 2018 వ సంవత్సరంలో సాధారణ బదిలీలలో భాగంగా అతికొద్ది మందిని బదిలీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు.

- Advertisement -

ఎన్నికల విధులు నిర్వహిస్తున్న బదిలీలు ఉండటం లేదు.
సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టార్లు ఎన్నికల విధుల్లో సహాయ ఎన్నికల ఖర్చుల పరిశీలకులుగా, ఎన్నికల ఖర్చుల అకౌంటింగ్ టీం ఇన్చార్జిలుగా విధులు నిర్వహిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 లోకసభ ఎన్నికల్లో విధులు నిర్వహించారు. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వారే విధులు నిర్వహించారు. అంటే 15 సంవత్సరాలుగా ఒకే చోట పని చేస్తూ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను పరిశీలించే అతి ముఖ్యమైన పనిని చేపట్టిన ఉద్యోగులకు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో ఎటువంటి అనుబంధం ఏర్పడుతుందో మనకు తెలియని విషయం కాదు.పార్టీల అభ్యర్థులతో లాలూచీపడి అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను తారుమారు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంతటి కీలక విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల బదిలీలలో ఉన్నతాధికారులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారో అర్థం కావడం లేదు. దీన్ని బట్టే కిందిస్థాయి అధికారుల నుంచి పైస్థాయి అధికారుల దాకా ఏ విధమైన అనుబంధం ఏర్పడిందో మనం అర్థం చేసుకోవచ్చు.

సార్లూ ఇప్పటికైనా లాలూచీ పడకుండా బదిలీలు చేపట్టండి
సహాకార శాఖ అధికారులు సార్లు ఇప్పటికైనా లీలలు చేయకుండా బదిలీలు చేపట్టాలని సహకార సంఘ సభ్యులు కోరుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఓకే స్థానంలో 10 నుంచి 25 సంవత్సరాలుగా పని చేస్తున్నారు.వీళ్లు తమ విధులు సరిగా నిర్వహించని కారణంగా ఎన్నో సహకార సంస్థలు దివాలా తీశాయి రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఇలా దివాలా తీసి కనబడుతున్నాయి. ఇలా అయితే కార సంఘాల మనుగడ చాలా కష్టమైతుందని పలు సహకార సంఘాలు దీనావ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని సహకార అభివృద్ధి చేసుకోవా లంటే ఇప్పటికైనాముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి సంవత్సరాలనుండి పాతుకుపోయిన ఉద్యోగుల బదిలీలు చేపట్టి సహకార సంఘాలలో అవినీతికి తావు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు