Wednesday, April 24, 2024

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ చీర్యాల

తప్పక చదవండి
  • పుట్టగొడుగుల్లా అనుమతి లేని అక్రమ నిర్మాణాలు
  • గత పాలకుల పాపం, కొనుగోలు చేసిన కస్టమర్లకు శాపం
  • అక్రమ షెడ్ల నిర్మాణంతో భారీగా గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి

అక్రమ నిర్మాణాలకు చీర్యాల గ్రామపంచాయతీ అడ్డాగా మారింది. గ్రామంలో ఎక్కడ చూసినా కూడా దొంగ అనుమతి పత్రాలతో నిర్మాణాలను చేపడుతున్నారు. పట్టించుకోవాల్సిన పంచాయతీ అధికారులు గత పాలకులతో కుమ్మక్కై గ్రామపంచాయతీ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ప్రస్తుత ప్రత్యేక అధికారుల పాలనలో కూడా అక్రమ నిర్మాణాలు ఆగకపోవడం గమనార్హం. చీర్యాల సర్వేనెంబర్ 295, 329, 330 లలో అక్రమ నిర్మాణాలు భారీగా చేపడుతున్నా కూడా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టకపోవడం విశేషం. గ్రామపంచాయతీకి రావలసిన ఆదాయాన్ని గత పాలకులు తమ జేబులోకి మరల్చుకున్నారు. దొంగ అనుమతి పత్రాలు సృష్టించి, బిల్డర్లకు తాము అండగా ఉంటాం అంటూ చెప్పడంతో ఎలాంటి అనుమతులు లేకుండానే వందల సంఖ్యలో నిర్మాణాలు చీర్యాల గ్రామంలో దర్శనమిస్తున్నాయి. సర్వేనెంబర్ 295 లో ఎలాంటి అనుమతులు లేకుండా గత అధికార పార్టీ నేత రెండు భారీ షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నా కూడా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టడానికి జంకుతున్నారు.

cheeryala village Carafe address for illegal constructions

పంచాయతీ కార్యదర్శి వివరణ :
చీర్యాల గ్రామంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై పంచాయతీ కార్యదర్శి నారాయణ గౌడ్‌ని వివరణ కోరగా, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని పదేపదే నోటీసులు జారీ చేస్తున్నా కూడా నిర్మాణాలు ఆగడం లేదని, అనుమతులు లేని నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు