Monday, April 29, 2024

రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వాలిడేషన్‌ మాయాజాలం

తప్పక చదవండి
  • కాంట్రాక్ట్‌ ఉద్యోగుల చేతుల్లో కీలు బొమ్మలా జిల్లా రిజిస్ట్రార్‌
  • మాజీ డిఆర్‌ సుబ్బారావు హయాంలో వాల్యుయేషన్‌ అయినట్టుగా చెబుతూ ఇప్పుడు చేస్తున్న వైనం
  • 2022లో ఖాళీగా ఉన్న స్టాంప్‌ పేపర్‌ను 1998లో వాలిడేషన్‌ అయినట్టుగా చూపిస్తున్న జిల్లా రిజిస్ట్రార్‌
  • అవి ఫేక్‌ వాల్యుయేషన్‌ అని తెల్చిన సదరు కాంట్రాక్టు ఉద్యోగి
  • పట్టించుకోని డీఐజీ, జాయింట్‌ ఐజి
  • పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారడమే దీనికి కారణమా..?
  • డబ్బులు ఇస్తే ఎంత పెద్ద ల్యాండ్‌ అయినా వాల్యుయేషన్‌ చేయడానికి రెడీగా ఉన్నకొంతమంది స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ సిబ్బంది

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో, రంగారెడ్డి జిల్లా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.. ఎడ్యుకేషన్‌, ఇండస్ట్రీస్‌, ఐటీ రంగంలో చాలా ముందుండటం వలన ఈ జిల్లాలో ఉన్న భూముల విలువ అమాంతం పెరగటానికి కారణం అయ్యింది.. భూముల విలువ పెరగటంతో అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల అండ దండలతో.. కాంట్రాక్టు పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగాలు తమ చేతివాటం చూపిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గతంలో రెండు డి ఆర్‌ ఆఫీస్‌ లు నెలకొని ఉండేవి.. గతంలో పని చేసిన డిఆర్‌ లు ఎంతో విలువలతో ప్రజలకు సేవ చేశారు. కానీ ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ లో అవినీతి కంపు కొడుతుంది. డిఆర్‌ ఆఫీస్‌ లో పనిచేస్తున్న కాంట్రాక్టు పద్ధతిలో ఉంటున్న ఉద్యోగుల చేతుల్లో డిఆర్‌ ఉండటమే దీనికి కారణం.. వాళ్లు ఏం చెప్పినా.. ఏం చేసినా అదే శాసనంగా నడుస్తోంది.. వారికి తన వంతు సహకారం అందిస్తున్నారు జిల్లా రిజిస్ట్రార్‌.. వీళ్లు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే పని చేస్తున్నారు వీరికి ఎక్కడ బదిలీలు ఉండవు.. ఇక విషయానికొస్తే ఒకే వాల్యుయేషన్‌ నెంబర్‌ 6948 / 2017, తేదీ 23 /8 /2018 తో ఒకటి, 10 రూపాయలు.. మరొకటి రూ. 50 స్టాంప్‌ పేపర్లలో.. ఒకే బ్యాంక్‌ చలానా తో రెండు వాల్యుయేషన్‌ చేశారు.. ఈ విషయంపై ఆదాబ్‌ ప్రతినిధి సదరు కాంట్రాక్టు ఉద్యోగిని అడగగా ఇవన్నీ ఫేక్‌ వాల్యుయేషన్స్‌ అని.. వీటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. తెలిపారు.. ఇదే విషయాన్ని ఆదాబ్‌ ప్రతినిధి డి ఐ జి కి, జాయింట్‌ ఐజి కి తెలియజేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయంపై ఆదాబ్‌ ప్రతినిధి ఆర్టిఏ యాక్ట్‌ ద్వారా అడిగితే.. దాదాపు సంవత్సరం కావస్తున్న ఎలాంటి సమాచారాన్ని తెలియజేయలేదు..

ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా కొందరు గండి కొడుతున్నారు. ఇదంతా కూడా ఉన్నతాధికారుల కనుసనల్లోనే జరుగుతుందని అనుమానం ప్రజల్లో లేకపోలేదు. అంతేకాకుండా ఒక్కో సర్వే నెంబర్‌ మీద నాలుగు ఐదు డాక్యుమెంట్లు కూడా జరిగిన దాఖలాలు ఉన్నాయి. సబ్‌ రిజిస్టర్‌ తలుచుకుంటే చాలు ఏదన్నా చెయ్యొచ్చు అనే రీతిలో లావాదేవీలు జరిపారు. ఇదిలా ఉంటే సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాల్లో ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారు. మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ కావాలంటే ఒక రేటు, ఓపెన్‌ ప్లాట్లకు, ఇండిపెండెంట్‌ ఇల్లకు, విల్లాలకు, అపార్ట్‌మెంట్లకు ఇలా ప్రతిదానికి ఓ రేటు డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా వసూళ్లకు పాల్పడుతుండడం బహిరంగ రహస్యం అయినా కూడా ఉన్నత అధికారులు వీరిపై చర్యలు చేపట్టకపోవడం చూస్తుంటే వారికి కూడా ముడుపులు ముడుతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉదాహరణకు 2022 లో ఖాళీగా ఉన్న 100 రూపాయల స్టాంప్‌ పేపర్‌ ను 1998లో వాల్యుయేషన్‌ అయినట్టుగా ఇప్పుడు చేస్తున్న వైనం.. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి.. వాటిని బహిర్గతం చేయడానికి సిద్ధంగా వున్నాం.. ఇప్పటికైనా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్నతాధికారులు.. రంగారెడ్డి డిఆర్‌ పై, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు