Saturday, April 27, 2024

శ్రీ చైతన్య సిఓ స్కూల్స్ ఓ బోగ‌స్‌

తప్పక చదవండి
  • 6వ త‌ర‌గ‌తి నుండి 9 త‌ర‌గ‌తి అనే సీఓ గ్రేడ్‌ కాన్సెప్ట్ తో మోసాలు
  • 2024-25 విద్యా సం.కి గాను అనుమ‌తులు లేకుండా ఆడ్మిష‌న్స్‌
  • ప్రభుత్వ అనుమతులు లేని చైత‌న్య సీఓ విద్యాసంస్థ‌లు
  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో చైత‌న్య విద్యా సంస్థ‌ల న‌యా దందా
  • త‌ల్లిదండ్రులు ఆ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌ను చేర్పించొద్దు
  • పిల్ల‌ల భ‌విష్య‌త్తుకై ఆలోచించి ముందండుగు వేయండి..
  • విద్యాహ‌క్కు చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాలి
  • క్రిస్టియన్‌ జన సమితి అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌ డిమాండ్‌

శ్రీ చైతన్య విద్యా సంస్థలు సిఓ గ్రేడ్‌ కాన్సెప్ట్‌ పేరుతో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యను బోధించేందుకు గాను 2024-25 విద్యా సంవత్సరానికి గాను పాఠశాలలను ప్రారంభించింది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చెల్‌ జిల్లాలోని ఎల్‌బినగర్‌, మణికొండ, మాదాపూర్‌లో పాఠశాలలను ప్రారంభించిన శ్రీ చైతన్య విద్యా సంస్థ, పొంతన లేని ప్రకటనలు గుప్పిస్తూ విద్యార్థుల త‌ల్లిదండ్ర‌లును మోసం చేస్తున్న ఈ సంస్థకు రాష్ట్ర విద్యా శాఖ నుండి ఏలాంటి అనుమతులు లేవు. విచిత్రం మేమిటంటే ఈ సిఓ పాఠశాలలకు విద్యాశాఖ రీజినల్‌ డైరెక్టర్‌తో పాటు సంబంధిత జిల్లాలకు సంబంధించిన విద్యాశాఖ అధికారుల నుండి ఏలాంటి అనుమతులు లేవు. అసలు 6-9 గ్రేడ్‌ అనే కాన్సెప్ట్‌ పేరుతో పాఠశాలలు ఏర్పాటు చేస్తే విద్యా శాఖ అనుతులివ్వరు. అయిన్నప్పటికీ దనర్జానే ద్యేయ్యంగా పెట్టుకున్న ఈ సంస్థ ఆకర్షనీయమైన పేర్లను పెట్టి, విద్యార్థుల తల్లిదండ్రును మోసం చేస్తూ, డోనేషన్‌లు, ఫీజుల రూపంలో లక్షల రూపాయాలు వసూలు చేస్తున్నారు. ఎలాంటి భద్రత, నాణ్యత ప్రమాణాలను పాటించకుండా, ప్రభుత్వ అనుమతులు పొందకుండానే, అద్దె భవనాల్లో పాఠశాలలను నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ఐఐటీ, నీట్‌ పేరులతో విద్యార్థులను ఓత్తిడికి గురిచేస్తూ నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు.

ఇదంత గమనిస్తే ఒక మాఫియాలా ఉంది.. తమ పిల్లలు పెద్ద బడుల్లో చదవాలి, క్యాంపస్‌లాంటి మెరుగైన పాఠశాలల్లో తమ పిల్ల‌లు విద్యానభ్య‌సించాలని తల్లిదండ్రుల్లో తపన తప్పితే. తాము పిల్లలను చేర్చిన పాఠశాలలకు ప్రభుత్వ అనమతి ఉందా అని కూడా చూడటం లేదు. ఇదే అదునుగా భావించిన కొన్ని ప్రైవేట్‌ విద్యా సంస్థలు ఇష్టం వచ్చినట్లు ఆక‌ర్ష‌నీయ‌మైన ప్రకటనలు చేస్తూ ఇటు విద్యార్థులను అటు వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. విద్యాశాఖలో ఉన్న కొంత మంది అవినీతి అధికారుల అండదండలతో గ్రేటర్ హైద‌రాబాద్‌తో పాటు ప‌క్క జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్‌లో ఆక్రమంగా పాఠశాలలు నెలకొల్పి శ్రీ చైతన్య విద్యా సంస్థలు పబ్బం గడుపుతున్నాయి.. అంతే కాకుండా 2024-25 విద్యా సంవత్సరానికి గాను మరో నాలుగు పాఠశాలలను గచ్చిబౌలి, సుచిత్ర, తెల్లాపూర్‌, హైటెక్స్ ప్రాంతాల‌లో ప్రారంభించింది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం అనుమతులు లేకుండా కొన‌సాగుతున్న పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వం సూచించిన ఫీజుల కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తూ, డోనేషన్‌ల రూపంలో అధిక మొత్తంలో డబ్బులు దండుకుంటున్న యాజామాన్యాల‌పై చ‌ట్ట విద్యాహ‌క్కు చ‌ట్ట ప్ర‌కారం ఆయా పాఠశాలలపై పది రెట్ల పేనాల్టీ వేయాల్సి ఉంటుంది. అన్ని తెలిసిన‌ కూడా శ్రీ చైతన్య స్కూల్స్ యాజ‌మాన్యం నిస్సుగ్గుగా అనుమ‌తులు లేని పాఠ‌శాల‌ల‌ను కొనసాగిస్తున్నారు. ఈ పాఠ‌శాల‌ల‌పై తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు దృష్టి సారించి, ఆయా పాఠ‌శాల‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు కోరుతున్నారు.

- Advertisement -

ఈ మేర‌కు క్రిస్టియన్‌ జన సమితి అధ్యక్షుడు మాసారం ప్రేమ్‌కుమార్ స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పాఠ‌శాల‌లు అనుమ‌తులు లేకుండా విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతున్నాయి.. ఇప్పటికైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి, వెంట‌నే ఆయా పాఠ‌శాల‌ల‌పై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతతో కూడిన విద్యాను అందించాలని, అనేక అవకత‌వ‌క‌లకు పాల్పడి విద్యార్థుల తల్లిదండ్రులను మొసం చేస్తూ, విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు