- రేవంత్ మావాడే అంటూ బెదిరింపులకు దిగుతున్న ఎస్.ఆర్. కన్స్ ట్రక్షన్స్ సంజీవ రెడ్డి
- ఇరిగేషన్ ఎన్.ఓ.సి లేకుండానే హెచ్.ఎం.డి.ఏ అనుమతులు మంజూరు చేసిన యాదగిరి రావు ..
- అమీన్ పూర్ లో అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు ..
- వాల్టా చట్ట ప్రకారం కేసులు నమోదు చేయని ఇరిగేషన్ అధికారులు..
- పెద్ద చెరువును పరిరక్షించే వారెవరు..?
- అధికారుల కనుసన్నల్లో అక్రమ నిర్మాణాలు చేస్తున్న కేటుగాళ్లు..
- కాసులకు కక్కుర్తి పడి ఆ వైపు కెన్నెత్తి చూడని అధికారులు..
- గత ప్రభుత్వం లో అమలు కానీ ఎన్జీటీ ఆదేశాలు.. ఈ ప్రభుత్వంలోనైనా అమలయ్యేనా..?
- ముఖ్య మంత్రి కార్యాలయాన్ని వివరణ కోరిన ఆదాబ్..
ఆయన బీఆర్ఎస్ అవినీతిపై అలుపెరుగని పోరాటం చేసిన డైనమిక్ లీడర్.. ఆ పోరాట పటిమతోనే బీఆర్ఎస్ మెడలు వంచి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చాడు.. పది సంవత్సరాలు అల్లాడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలని కంకణం కట్టుకుని విజయవంతంగా తన ఫంధాలో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి.. అయితే చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకోవాలని చూసే కొందరు ముష్కరులవల్ల ప్రభుత్వం పేరు చెడిపోతోంది.. అలాంటి ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్ :
సంగారెడ్డి జిల్లాలోని, అమీన్ పూర్ మండలం పెద్ద చెరువు ఎఫ్టీల్ బఫర్ జోన్లలో ఇరిగేషన్ ఏన్.ఓ.సి లేకుండానే.. భారీ భవనాలు నిర్మిస్తున్నారు కేటుగాళ్లు.. అక్రమ నిర్మాణాల పై పిర్యాదులు చేస్తే.. అక్రమ నిర్మాణ దారులు సాక్షాత్తు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతుండటం విస్మయానికి గురిసిచేస్తుంది..గత ప్రభుత్వంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ.. నాటి ప్రభుత్వ పెద్దల అండ దండలతో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కోనసాగాయి.. నేటి ప్రభుత్వంలో నైనా అక్రమ నిర్మాణాల కు అడ్డుకట్ట పడుతుందని అనుకుంటే..అక్రమార్జనకు అలవాటు పడ్డ హెచ్.ఎం.డి.ఏ అధికారి యాదగిరి రావు ఉంటే అది సాధ్యమేనా..?ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారక పోవడం తో ప్రజలకు ఈ ప్రభుత్వం పై కూడా విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది.. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు హెచ్.ఎం.డి.ఏ లో జరుగుతున్న అక్రమ తంతు పై దృష్టి సారించి..ప్రక్షాళన చేస్తే తప్పా.. అక్రమాలను అరికట్టడం సాధ్యమవుతోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..
అసలు విషయం ఏమిటంటే.. సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మండలంలో ఉన్న పెద్ద చెరువు ఎఫ్టీల్,బఫర్ జోన్లలలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.. ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారక పోవడంతో చెరువు సైతం కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది..చెరువు పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు పొందాలంటే ఇరిగేషన్ ఎన్.ఓ.సి తప్పని సరి చట్టంలో ఉన్న నిబంధన.. ఇవేమి పట్టని హెచ్.ఎం.డి.ఏ అధికారి యాదగిరి రావు కాసులకు కక్కుర్తి పడి,ఇరిగేషన్ ఎన్ ఓ సి లేకుండానే ఇష్టా రాజ్యంగా నిర్మాణ అనుమతులు ఇస్తుండటంతో ప్రజలు ఆస్తులు ప్రయివేటు పరం అవుతున్నాయి.. చెరువులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన ఇరిగేషన్ అధికారులు.. అక్రమ నిర్మాణాలు చేస్తుంటే ప్రాథమిక స్థాయిలో నే వాటిని గుర్తించి వాల్టా చట్ట నిబంధనల ప్రకారం వారిపై కేసులు నమోదు చేయకపోవడంతో అక్రమ నిర్మాణ దారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోంతుంది.. ఇదే తరహాలో అమీన్ పూర్ మండలంలోని పెద్ద చెరువు ఎఫ్టీల్,బఫర్ జోన్ లో నిర్మిస్తున్న ఎస్.ఆర్ కన్స్ ట్రక్షన్స్ సంజీవ రెడ్డి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం అధికారుల అవినీతికి అద్దం పడుతోంది..పైగా సామాజిక బాధ్యతతో అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదుదారుడిపై రెచ్చిపోయిన సంజీవ రెడ్డి స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ఏకవచనంతో సంబోధిస్తూ.. భయ భ్రాంతులకు గురి చేయడంతో పాటు, సంగారెడ్డి జిల్లా ఎస్పీ పేరు ను సైతం వాడటం ఈ ప్రాంతంలో చర్చ నియాంశంగా మారింది.. గత ప్రభుత్వంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అక్రమ నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు, చెరువు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణ అనుమతులు ఇవ్వడానికి వీలు లేదని తేల్చి చెప్పింది.. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెరువు పరి రక్షించేందుకు పత్యేక కమిటీని నియమించిన ఆ కమిటీ నేటికీ పని చేయక పోవడం శోచనీయం.. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి ఎన్జీటీ ఆదేశాలు అమలు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.. అక్రమ నిర్మాణ దారుడు ముఖ్యమంత్రి పేరును వాడుతుండటంతో ‘ఆదాబ్ హైదరాబాద్’ ప్రతినిధి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించగా అటువంటిది ఏమి లేదని.. అలాంటి వారిపై చర్యలు తప్పవని తెలియచేశారు.. పెద్ద చెరువు అక్రమాల పై పూర్తి ఆధారాలతో మరిన్ని కథనాలు మీ ముందుకు తేనుంది ‘ఆదాబ్ హైదరాబాద్’.. ‘మా అక్షరం అవినీతి పై అస్త్రం’….