Saturday, July 27, 2024

అక్రమ క్రమబద్దీకరణ చేసిన అధికారులపై చర్యలెప్పుడూ..?

తప్పక చదవండి
  • కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ను సీరియస్‌ గా తీసుకోని సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌
  • ఎన్ని ఫిర్యాదులిచ్చినా.. నో యాక్షన్‌..!
  • రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కు లేఖతో సరి
  • కాంట్రాక్ట్‌ డిగ్రీ లెక్చరర్ల పర్మినెంట్‌ లో అంతా గోల్‌ మాల్‌ యవ్వారాలే..!
  • అయినా వాకాటి, మిట్టల్‌, జేడీ, ఆర్జేడీలపై చర్యలు శూన్యం

కాంట్రాక్ట్‌ డిగ్రీ లెక్చరర్ల పర్మినెంట్‌ గోల్‌ మాల్‌ యవ్వారంపై ఎన్ని ఫిర్యాదులిచ్చినా.. పరిస్థితి దున్నపోతు మీద వానపడ్డట్లే ఉంది. కాంట్రాక్ట్‌ డిగ్రీ అధ్యాపకుల క్రమబద్దీకరణ విషయంలో ఎలక్షన్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ పూర్తిగా ఉల్లంఘించబడిరదని.. అప్పటి రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్‌ సీపీ, అప్పటి, ప్రస్తుత సీఎస్‌, సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్లకు ఫిర్యాదులు వెళ్లినా.. ఇప్పటికీ ఎలాంటి యాక్షన్స్‌ తీసుకోకపోవడం విస్మయం కల్గిస్తోంది. అపాయింట్‌ మెంట్‌ ఆర్డర్సే ముందు డేట్లతో ఇచ్చారని.. ఈ విషయంలో అప్పటి కమిషనర్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, జేడీ రాజేందర్‌ సింగ్‌, ఆర్జేడీ యాదగిరి భారీగా ముడుపులు నొక్కేసి కాంట్రాక్ట్‌ డిగ్రీ లెక్చరర్లను పర్మినెంట్‌ చేసేశారని కంప్లైంట్‌ వెళ్లినా.. ఇప్పటికీ పట్టించుకున్న నాథుడే లేకపోవడం చిత్రంగా అనిపిస్తోంది.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్‌ డిగ్రీ లెక్చరర్లుగా పనిచేస్తున్న 128 మందిని అక్టోబర్‌ లో పర్మినెంట్‌ చేసింది. ఇందులో 61 మంది కాంట్రాక్ట్‌ లెక్చరర్లు కాగా.. 67 మంది ఆన్‌ ఎయిడెడ్‌ సంస్థల్లో వర్క్‌ చేస్తున్న వాళ్లను అప్పటి రాష్ట్ర సర్కార్‌ క్రమబద్దీకరించింది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. వీరి క్రమబద్దీకరణలో ఎన్నికల కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘనలు జరిగాయని.. పెద్ద ఎత్తున క్రమబద్దీకరణ కోసం డబ్బులు చేతులు మారాయని కొందరు ప్రభుత్వంలోని కీలక అధికారులకు, కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్‌ చేశారు. గత శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అక్టోబర్‌ 09న కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. వాస్తవానికి ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ, అక్టోబర్‌ 09న ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే.. అక్టోబర్‌ 07, 08న పాత డేట్లతో కాంట్రాక్ట్‌ డిగ్రీ అధ్యాపకులను పర్మినెంట్‌ చేస్తూ.. అప్పటి విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు ఇవ్వడం, దానికి కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ వత్తాసు పలుకగా.. జేడీ రాజేందర్‌ సింగ్‌, ఆర్జేడీ యాదగిరి తమ సంపూర్ణ సహకారాన్ని అందించారు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి నుంచి సుమారు రూ.5 లక్షల నుంచి ఆపై మొత్తాన్ని ఆమ్యామ్యాలుగా వీరు దండుకున్నట్లు బలమైన ఆరోపణలున్నాయి.

- Advertisement -

సీరియస్‌ గా తీసుకోని సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌

మరోవైపు డిగ్రీ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల అధ్యాపకుల క్రమబద్దీకరణలో అతిపెద్ద గోల్‌ మాల్‌ జరిగినట్లు విమర్శలుండడం, కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ను పట్టించుకోకుండా రెగ్యులరైజ్‌ ప్రక్రియను చేపట్టడడంతో తేదీ 17-10-2023 నాడు డిగ్రీ గెస్ట్‌ లెక్చరర్‌ గా పనిచేస్తున్న కొండగొర్ల చంద్రశేఖర్‌ ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈనేపథ్యం లోనే స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పటి, ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి క్షుమారికి సంబంధిత కాపీని పంపించి చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నుంచి వచ్చిన లేఖపై సీఎస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో.. కొండగొర్ల చంద్రశేఖర్‌ మళ్లీ ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్‌ గా తీసుకోవాల్సిన సెంట్రల్‌, స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్స్‌ సదరు అభ్యర్థికే కాల్‌ చేసి ఈ విషయంలో తామేమీ చేయలేమని చెప్పడం గమనార్హం.

మరోవైపు అప్పటి రాష్ట్ర డీజీపీ, సీపీలకు కూడా ఈ వ్యవహారాన్ని తేల్చాలని ఫిర్యాదు చేయడంతో.. వారు ఈకేసును బేగం బజార్‌ పోలీసు స్టేషన్‌ కు ఫార్వార్డ్‌ చేసి చేతులు దులుపుకున్నారు. తర్వాత ఈకేసుపై ఎలాంటి పురోగతిని లేకపోవడం గమ్మత్తుగా ఉంది. వాస్తవానికి డిగ్రీ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల క్రమబద్దీకరణ అనేది లోపభూయిష్టంగా జరిగినట్లు అర్థమవుతోంది. ఎన్నికల కోడ్‌ కు ముందే జాయినింగ్‌ ఆర్డర్స్‌ తీసుకోవడం.. కానీ, ముందు డేట్లతో జాయినింగ్స్‌ ఆర్డర్స్‌ తీసుకున్నట్లు ప్రిన్సిపల్స్‌ రికార్డులకు నమోదు చేయడం జరిగింది. అందువల్ల ఈ విషయంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరిగినందుకు సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌, రాష్ట్ర పోలీసు యంత్రాంగం సీరియస్‌ గా రియాక్ట్‌ అయితే.. అప్పటి విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, జేడీ రాజేందర్‌ సింగ్‌, ఆర్జేడీ యాదగిరిలకు గట్టి దెబ్బె పడేది. కానీ, అలా జరగకపోవడంతో.. డిగ్రీ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల క్రమబద్దీకరణలో దండిగానే డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలున్న సదరు ఉన్నతాధికారులు చేసింది దొంగ పనే అయినా.. దర్జాగా కాలర్‌ ఎగురేసుకొని తిరిగేందుకు అవకాశం దొరికినట్లైంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు