Sunday, May 19, 2024

ఇరవై శాతం మందిలో మానసిక అనారోగ్యం

తప్పక చదవండి

ప్రపంచాన్ని అతకాలకుతలం చేసిన కోరోనా మహమ్మారి అనంతరం ప్రజల రోజువారీ జీవితాలలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సామాజిక ఒంటరితనంతో ప్రజలు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మానసిక ఆరోగ్యాన్ని ప్రజారోగ్య అజెండాలో చేర్చకపోవడం, మానసిక ఆరోగ్యానికి సరిపడా నిధులు కెటాయించక పోవడం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడే మానసిక ఆరోగ్యనిపుణుల కొరత తీవ్రంగా ఉండడం, ప్రజల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి సరైన నాయకత్వం లేకపోవడం మూలంగా ప్రజలు తీవ్రమైన మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానసిక ఆరోగ్యంలో పెట్టుబడులు పెరిగినపుడే ప్రజల మానసిక స్తిరత్వం పెరుగుతుంది. ఇటీవల జరిగిన సంఘటనలు పరిశీలించి చూస్తే కామంతో లైంగిక దాడులు, పసిపిల్లల పట్ల క్రూరత్వం, విపరీత ఆలోచనలు, ఒంటరి తనంతో కృంగిపోవడం, అన్ని ఉన్నా ఏమిలేని వాడుగా జీవనాన్ని వెల్లదీయడం, మృగంలా, శాడిస్టుల్లా ప్రవర్తించడం, పగలు ప్రతికారాలతో హత్యలు, ఏమి సాధించలేని నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యలు రోజు రోజు పెరుగుతుండడం మన కళ్ల ముందరనే కనిపిస్తున్నాయి. వీరంతా సమాజంలో ఈ విధంగా ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? వీరి మనస్తత్వం ఇలానే ఎందుకు ఉంటోంది?
సమాజం చులకనగా చూస్తుందనే భయం.. మనిషి పుట్టాక ఎలాంటి వైకల్యం లేకుండా ఉంటే అతడి జీవితం సంతోషంగా సాగుతుంది. ఏ చిన్న వైకల్యం ఉన్నా అది జీవితాంతం అతడిని పీడిస్తుంది. కొందరు పుట్టుకతో ఆరోగ్యకరంగా బాగానే ఉన్నప్పటికీ ఎదుగుదలలో మానిసిక రోగులుగా మారిపోతుంటారు. ఇలా ఎందుకు జరిగిందన్నది అర్థంకాదు. కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. చాలా మందికి మానసిక సమస్యల సరైన అవగాహన లేకపోవడం, ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో మానసిక వైకల్యానికి సంబంధించి నిధులు లేకపోవడం, మానసిక వైకల్య సమస్యలపై నిశితమైన పరిశీలన లేకపోవడం, ప్రాధమిక దశలోనే సమస్యను గమనించి తగిన వైద్య చికిత్స అందించకపోవడం, మానసిక వైకల్య బాధితులకు చికిత్స చేసేందుకు తగు మానసిక నిపుణులు అందుబాటులో లేకపోవడం, మానసిక సమస్యలు ఉన్నట్లు బయటికి చెబితే సమాజం చులకనగా చూస్తుందన్న భయంతో ఈ లక్షణాలను చెప్పుకొనేందుకు అవమానంగా భావిస్తూ సహాయం పొందడానికి చాలామంది ముందుకు రావడం లేదు ఇలా పలు కారణాలు కనిపిస్తున్నాయి.
ఇరవై శాతం మందిలో మానసిక అనారోగ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన నివేదిక ప్రకారం, భారతదేశంలో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్యతో పోల్చితే దేశంలో మానసిక వైద్యులు, మనస్తత్వవేత్తల కొరత ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. భారతదేశంలో ప్రతి లక్ష జనా భాకు మనోరోగ వైద్యులు (0.3), నర్సులు (0.12), మనస్తత్వవేత్త లు (0.07), సామాజిక కార్యకర్తలు (0.07) ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది, భారతదేశంలో సుమారు 20 శాతం మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలను చూస్తే 56 మిలి యన్ల భారతీయులు నిరాశతో బాధపడుతున్నారు, 38 మిలియన్ల మంది భారతీయులు ఆందోళన రుగ్మతలతో బాధపడుతున్నారు
మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం 2017 హక్కులు.. ప్రతి మనిషికీ పుట్టుకతోనే సమాజంలో గౌరవంగా బతికే హక్కు ఉంది. అందరిలాగే సమాన గౌరవం, గుర్తింపు పొందే హక్కు మానసిక వైకల్యం ఉన్నవారికీ ఉంది. రోగి మానసిక ఆరోగ్య పరిస్థితిలో అనారోగ్యానికి ఎలా చికిత్స చేయాలి లేదా చికిత్స చేయకూడదని (అడ్వాన్స్‌ డైరెక్టివ్‌ చేసే హక్కు) తెలుపవచ్చు. ఒక వ్యక్తి తన/ఆమె తరపున ఆరోగ్యానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను తీసుకోవడానికి నామినేట్‌ చేయబడిన ప్రతినిధిని నియమించుకునే హక్కు కలిగి ఉంటాడు. మానసిక ఆరోగ్య సంరక్షణను పొందే హక్కు. ఉచిత, నాణ్యమైన సేవలను పొందే హక్కు. ఉచితంగా మందులు పొందే హక్కు. సమాజ జీవన హక్కు. క్రూరమైన, అమానవీయమైన మరియు అవమానకరమైన ప్రవర్తన నుండి రక్షణ పొందే హక్కు. ప్రాథమిక సౌకర్యాలు కలిగిన, సురక్షితమైన మరియు పరిశుభ్రమైన వాతావరణంలో జీవించే హక్కు. న్యాయ సహాయం పొందే హక్కు. తీవ్ర మానసిక రోగి ఆత్మహత్యకు ప్రయత్నించడం నేరం కాదు. ఈ చట్టం భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 309లో మార్పులను తీసుకువచ్చింది (ఇది ఆత్మహత్యాయ త్నాన్ని నేరంగా పరిగణించింది). మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు: జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం (చీవీనూ): మానసిక ఆరోగ్య రంగంలో అర్హత కలిగిన నిపుణుల కొరతను పరిష్కరించ డానికి, ప్రభుత్వం 1982 నుండి జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని (చీవీనూ) అమలు చేస్తోంది.
మానసిక ఆరోగ్య చట్టం: మెంటల్‌ హెల్త్‌ కేర్‌ యాక్ట్‌ 2017 ప్రతి వ్యక్తికి మానసిక ఆరోగ్య సంరక్షణ మరియు మానసిక ఆరోగ్య పరి రక్షణకు అవసరమగు చికిత్సను ప్ర భుత్వమే స్వయంగా అందిస్తుంది.
కిరణ్‌ హెల్ప్‌ లైన్‌: 2020లో, ఆందోళన, ఒత్తిడి, నిరాశ, ఆత్మ హత్య ఆలోచనలు మరియు ఇతర మానసిక ఆరోగ్య సమస్యలను ఎదు ర్కొంటున్న వ్యక్తులలో మానసిక డైర్యాన్ని నింపడానికి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 24/7 టోల్‌-ఫ్రీ హెల్ప్‌లైన్‌ కిరణ్‌ ని ప్రారంభించింది.
మనోదర్పన్‌ ఇనిషియేటివ్‌: ఇది కోవిడ్‌-19 మహమ్మారి సమ యంలో విద్యార్థులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయు లకు వారి మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు కోసం మానసిక సాంఘిక సహా యాన్ని అందించడం లక్ష్యంగా విద్యా మంత్రిత్వ శాఖ యొక్క చొరవ తీసుకొని పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మనస్‌ మొబైల్‌ యాప్‌: 2021లో, భారత ప్రభుత్వం వ్యక్తులలో మానసిక శ్రేయస్సును ప్రోత్సహించడానికి మనస్‌ (మెంటల్‌ హెల్త్‌ అండ్‌ నార్మల్సీ ఆగ్మెంటేషన్‌ సిస్టమ్‌) మొబైల్‌ యాప్‌ను ప్రారం భించింది. ప్రధానమంత్రి సైన్స్‌, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ (ూవీ-ూుIAజ) ద్వారా వీAచీAూ ఒక జాతీయ కార్యక్రమంగా రూపొందించారు. ప్రశాంత జీవనాన్ని అలవర్చుకోవాలి.. మను షులు ప్రవర్తించే తీరు ఒక్కొక్కరిది ఒక్కోరకంగా ఉంటుంది. మను షుల ప్రవర్తనతీరును బట్టి వారి యొక్క పర్సనాలిటీ గుర్తించ బడుతుంది. సమాజం ఆమోదించని మనుషులలోని ప్రవర్తనలను బట్టి వ్యక్తిత్వలోపాలు ఏర్పడుతాయి. వ్యక్తిత్వలోపాలను సరిదిద్దుకోగలిగితే భవిష్యత్తు సమాజం నందనవనంలా తయారవుతుంది. మానసిక సమస్యకు సకాలంలో పరిష్కారం పొందాలి. ప్రశాంత జీవనాన్ని అలవర్చు కోవాలి. వ్యాయామం, యోగ వంటివి చేయడం అలవాటు చేసు కోవాలి. ఆరోగ్యం అంటే శరీరానికే అనుకోవడం సర్వసాధారణం. కానీ మానసిక ఆరోగ్యం కూడా కావాలి. మనకు వచ్చే చాలా శారీరక రుగ్మతలకు మన మానసిక స్థితే కారణం. ఒత్తిడి, కుంగు బాటు, భయం, ఆందోళన లాంటి మానసిక సమస్యలు ఎదురైన ప్పుడు వెంటనే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. సైకాలాజికల్‌ కౌన్సెలింగ్‌ మరియు సైకోథెరపీ లు చాలా వరకు వ్యక్తుల ప్రవర్తనలో మార్పులను సరిదిద్దుకోవడానికి పనిచేస్తుంటాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు