Sunday, July 21, 2024

సిగ్గు.. సిగ్గు..మద్యం సిండికేట్‌కు అడ్డే లేదట..!

తప్పక చదవండి
  • చోద్యం చూస్తున్న ఎక్సైజ్‌ అధికారులు..
  • గ్రామాల్లో వైన్స్‌లను తలపిస్తున్న బెల్టు షాపులు..
  • రోజుకో రేటు, మందుబాబుల జేబులకు చిల్లులు..
  • టేకులపల్లిలో మద్యం దందాకు అభయమిస్తున్నది ఎవరో..?
    ఇల్లందు : టేకులపల్లి మండలంలో మద్యం ఏరులై పారుతోంది.. సిండికేట్‌ పేరుతో మద్యం దందాను విచ్చలవిడిగా సిండికేట్‌ సభ్యులు సాగిస్తున్నారు.. కిరాణా దుకాణంలో సరుకుల్లా మద్యాన్ని బెల్టు షాపులకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇక అడ్డుకట్ట వేయాల్సిన ఎక్సైజ్‌ శాఖ కళ్ళున్నా లేనట్లుగా వ్యవహరించడం బహు బాగుగా ఉందనే చెప్పుకోవచ్చు. సిండికేట్‌ పేరుతో మద్యాన్ని మొత్తం ప్రత్యేక గోధాంలో పెట్టి మరీ విక్రయాలు చేస్తున్నారు. అంతేకాదు ఆటోల్లో మద్యాన్ని ఏకంగా బెల్ట్‌ షాప్‌ లకు తరలిస్తున్నారు..అడిగేవారు ఎవడూ లేడు అన్నట్లుగా ఇష్టం వచ్చినప్పుడల్లా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్ముతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మద్యం బెల్టు షాపులు కిరాణా దుకాణాలను మించి పోయా యని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో మద్యం తాగాల్సి వస్తే, టేకులపల్లి వెళ్లాల్సి వచ్చేదని.. ఇప్పుడు ఊర్లోనే ఉదయం 6 కాకముందే పాల దుకాణాల వలె తెరుచుకుంటున్నాయని మహిళలు చెబుతున్నారు.. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న సిండికేట్‌ మద్యం కల్తీకి పాల్పడుతుందని ఆరోపణలు లేకపోలేదు..
    వైన్‌ షాపుల్లో అమ్మాల్సిన మద్యాన్ని సిండికేట్‌ పేరుతో అధిక ధరకు బెల్టు షాపులకు విక్రయిస్తుండగా.. సంబంధిత శాఖ అధికారులు పట్టించు కొకపోవడం పట్ల మహిళలు సిగ్గు..సిగ్గు అంటూ అధికారులు నిద్ర పోతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాలతో పనిలేకుండా జేబుల్లోకి నెలవారీ బత్తాయిలు వస్తుంటే ఇక ఎలా ఆపుతా రంటూ మహిళలు ఆరోపణలు చేస్తుండటం చెప్పుకోదగ్గ విషయం. ఇప్పటికైనా ఆరోపణలకు చెక్‌ పెడతారా..? లేదా..? టేకులపల్లి మద్యం వ్యాపారానికి అండ దండగా ఎవరున్నారు అన్న వివరాలు రేపటి సంచికలో..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు