- 63 కిలోల పూర్తి సేంద్రీయ లడ్డు..
- పలు ప్రత్యేకతలు కలిగిన లడ్డు..
- ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం
సంపాదించిన ఘనత సాధించిన లడ్డు..
( ఖైరతాబాద్ “గణనాధునికి 63 కిలోల లడ్డూని పూర్తి సేంద్రియ పద్ధతిలో సమర్పించనున్నారు స్వామి భక్తుడు, సామాజికవేత్త శివన్న )
హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేషుడంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ భారత దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నారు.. ఆయన్ను కొక్కసారి దర్శించుకుని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.. గణేష్ నవరాత్రుల్లో అశేష భక్తజనం పూజలు అందుకుని, నిమజ్జనం జరిగే రోజు లక్షలాది భక్తాదులు ఆయన శోభా యాత్రను కన్నులారా వీక్షించి తరిస్తుంటారు.. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.. పోలీసు వ్యవస్థకూడా తమ సాయ శక్తులా యాత్ర సజావుగా సాగడానికి కృషి చేస్తారు.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీ.హెచ్.ఎం.సి. ప్రత్యేక ఏర్పాట్లను చేస్తుంది.. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడికి సమర్పించే లడ్డు ప్రసాదం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.. అత్యంత విశిష్టమైన ఈ సారి భక్తుడు శివన్న సమర్పించనున్న లడ్డు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోవడం విశేషం..
శోభకృత్ నామ సంవత్సర వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ లో 69వ సంవత్సరపు 63 అడుగులలో దర్శనమిస్తున్న శ్రీ దశమహా విద్యా గణపతికి పరమశివుని భక్తుడు శివన్న ఆధ్వర్యంలో దేశంలోనే ప్రప్రధమంగా 63 కిలోల పూర్తి సేంద్రియ (ఆర్గానిక్) లడ్డూని, నిష్టాగరిష్టులైన ఆరుగురు వేద పండితుల సమక్షంలో బెంగాల్ నుండి శనగపిండిని, శర్కరా (పంచదార) ను తెప్పించి, జీడిపప్పును పలాస (శ్రీకాకుళం జిల్లా) నుండి ఎండు ద్రాక్షను, ప్రత్యేకమైన బాదం చెట్టు ద్వారా బాదం పప్పును, నాణ్యమైన ఆయుర్వేద యాలుకలను, పరిపూర్ణమైన గోమాత యొక్క నెయ్యి, మైసూర్ నుండి ఘాటైనా సువాసన ఇచ్చే కర్పూర మిశ్రమాలతో కలగలిపి ఖైరతాబాద్ గణనాధునికి సమర్పించనున్నారు..
ఇంతటి మహోన్నతమైన ఘట్టానికి పూర్తి సహాయ సహకారాలందించిన గణేష్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ సింగరి రాజ్ కుమార్ కి, శివన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. సహకరించిన పెద్దలు ‘ఆదాబ్ హైదరాబాద్’ న్యూస్ పేపర్ ఎడిటర్ సత్యం వీరమళ్ళ, పగడాల అశోక్, మొగుళ్ళ నరేందర్, మీడియా సెలక్ట్ అధినేత నీలం రమేష్, కిసాన్ పరివార్ అధినేత ననావత్ భూపాల్ నాయక్, ఆకుల సతీష్, సహదేవ్, ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు, గజ్జెల ఆనంద్, వినోద్ కుమార్ యాదవ్, ఉదయ్, శ్రీధర్, శ్రీనివాస్ యాదవ్, రమాకాంత్, లడ్డూ తయారీదారడు శొంఠి బాబుల్ రెడ్డి, అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షుడు పుట్టా రాము, ముఖ్య సభ్యులు సత్య ప్రకాష్, దినేష్ రెడ్డి, అరుణ్ సింగ్, పొలమొని సహదేవ్, సంపత్ కుమార్, అనిరధ్, శ్రీకాంత్ రెడ్డి, అరుణ్ లకు కృతజ్ఞతలు తెలిపారు శివన్న..
కాగా ఈ కార్యక్రమంలో ఇతర ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొననున్నారు.. ఈ లడ్డూ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించినందుకు వ్యవస్థాపకులైన వివేకానందబాబుని ప్రత్యేకంగా ప్రశంసించారు.. ఈ రికార్డ్ సాధించడం పట్ల గణేష్ ఉత్సవ కమిటీ వారు హర్షం వ్యక్తం చేసారు..