సూర్యాపేట(ఆదాబ్ హైదరాబాద్) : తుంగతుర్తి నియోజక వర్గంలోని నూతనకల్ మండలం కేంద్రంలో ఉన్న జడ్పీ హెచ్.ఎస్ స్కూలును శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఏడోవ తరగతి విద్యార్థులకు బోర్డుపై ఇంగ్లీషు పదాలకు అర్థాలను స్పెల్లింగులను విష్ణు ,సంకీర్తనలను కలెక్టర్ స్వయంగా బోర్డుపై రాసి అడిగారు. విద్యార్థిని విద్యార్థులతో కలెక్టర్ ఒక టీచర్ గా వారికి ఇంగ్లీ షు పదాల అమరికను వివరించారు. ఉపాధ్యాయులు ఇంగ్లీషు ,సైన్సు , మ్యాక్స్ సబ్జెక్టులను విద్యార్థులకు చెప్పునప్పుడు విద్యార్థులకు సబ్జెక్టుపై పూర్తి అవగాహన వచ్చేలా గుణాత్మకంగా బోధించాలని కలెక్టర్ తెలిపారు. క్లాస్ టీచర్ ఎండి సాలేహ బేగం ను బోధన విధానాన్ని అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ హెచ్ఎం మోతిలాల్ టీచర్లు సిబ్బంది పాల్గొన్నారు.