Saturday, July 27, 2024

7 అంశాల బర్రెలక్క మేనిఫెస్టో

తప్పక చదవండి
  • తెలంగాణ ఎన్నికల్లో సంచలనంగా మారిన బర్రెలక్క
  • నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో ప్రశ్నిస్తానని హామీ
  • ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదలయ్యేలా చూస్తానన్న శిరీష
  • నిరుద్యోగ భృతి కోసం పోరాడతానని ప్రతిన

తెలంగాణ ఎన్నికల్లో ఏదైనా సెన్షేషన్ ఉందంటే అది బర్రెలక్క పోటీ మాత్రమే. ఎన్ని డిగ్రీలు చదివినా.. ఏం లాభం ప్రభుత్వ ఉద్యోగాలు రావడంలేదు.. అందుకే బర్లు కాసుకుంటున్నా.. అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టింది శిరీష. ఆ అమ్మాయి పెట్టిన వీడియో అప్పట్టో ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. ఆ వీడియో ఆధారంగా అటు ప్రతిపక్షాలు, ఇటు నిరుద్యోగులు ఉద్యోగ కల్పనపై సర్కార్ పై విమర్శాస్త్రాలు సంధించారు. దీంతో ఆ యువతి బర్రెలక్కగా ఫేమస్ అయింది.

కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేస్తోంది బర్రెలక్క. అయితే ఆమెకు విజిల్ గుర్తు కేటాయించింది ఈసీ. ఇక నిరుద్యోగుల తరపున బరిలో శిరీషకు పలు ప్రజాసంఘాలతో పాటు విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులు మద్ధతు పలికుతున్నారు. జానపద కళాకారులు కూడా సపోర్టు ఇస్తున్నారు. మహిళల నుంచి మంచి స్పందన కూడా లభిస్తోంది. ఇక కొల్లాపూర్ లో తనను గెలిపిస్తే ఏం చేస్తాననే అనే విషయంపై కూడా క్లారిటీతో ఉంది శిరీష. ఇందుకోసం తక్కువ అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించింది. మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది.

- Advertisement -

బర్రెలక్క మేనిఫెస్టో ఇదే..

  1. నిరుద్యోగ పక్షనా.. అసెంబ్లీలో ప్రశ్నిస్తా. సరైన సమయంలో నోటిఫికేషన్లు విడుదల అయ్యేలా నిలదీస్తా
  2. పేదల ఇండ్ల నిర్మాణం కోసం కృషి చేస్తా..
  3. ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులందరికీ భృతి ఇప్పిస్తా..
  4. ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతా..
  5. ఉచిత విద్య, వైద్యం కోసం కృషి చేస్తా..
  6. నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు- ఫ్రీ కోచింగ్ అందిస్తా..
  7. యువత ఉన్నత చదువులకు ఫ్రీ కోచింగ్ అందించి ప్రోత్సహిస్తా..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు