Friday, May 3, 2024

వెయ్యి కోట్ల‌కు పైగా ప్రైజ్‌మ‌నీ గెలిచిన జ‌కోవిచ్..

తప్పక చదవండి

సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ దిగ్గ‌జాల‌కు సైతం సాధ్యం కాని రికార్డును నెల‌కొల్పాడు. ఫ్రెంచ్ ఓపెన్‌ లో విజేత‌గా నిలిచి అత్య‌ధికంగా 23వ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. అంతేకాదు మ‌ళ్లీ వ‌రల్డ్ నంబ‌ర్ 1 ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో గెలిచిన అత‌ను నంబ‌ర్ 1 కార్లోస్ అల్క‌రాజ్ వెన‌క్కి నెట్టి అగ్ర‌స్థానానికి చేరాడు. ఈ ఏడాది జ‌కోవిచ్ మూడు సింగిల్స్ టైటిళ్లు సాధించాడు. దాంతో, అత‌డు ఇప్ప‌టికే రూ. 41 కోట్లు సంపాదించాడు.

త‌న 20 ఏళ్ల కెరీర్‌లో ఈ స్టార్ ప్లేయ‌ర్ 94 సింగిల్స్ టైటిళ్లు, ఒక డ‌బుల్స్ ట్రోఫీ గెలిచాడు. ఈ విజ‌యాల‌కు ప్ర‌తీక‌గా అత‌డికి రికార్డు స్థాయిలో ప్రైజ్‌మ‌నీ ముట్టింది. అవును… ఇప్ప‌టి వ‌ర‌కు అత‌ను వెయ్యి కోట్ల‌( 169, 762, 762 అమెరిక‌న్ డాల‌ర్లు, భార‌తీయ క‌రెన్సీలో రూ.13,98,28,49,417)కు పైగా ఆర్జించాడు.

- Advertisement -

2008లో తొలి గ్రాండ్‌స్లామ్
అభిమానులు ముద్దుగా జోక‌ర్ అని పిలిచే జ‌కోవిచ్ టెన్నిస్ కెరీర్ 20003లో మొద‌లైంది. ఆ ఏడాది అత‌ను తొలిసారి ఏటీపీ టూర్‌లో ఆడాడు. అప్ప‌టికే రోజ‌ర్ ఫెద‌ర‌ర్, ర‌ఫెల్ నాద‌ల్ టెన్నిస్ ఆట‌ను శాసిస్తున్నారు. 2008లో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్న‌మెంట్‌లో విజేత‌గా నిలిచాడు. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. అక్క‌డితో మొద‌లు.. ఫెద‌ర‌ర్, నాద‌ల్‌కు ప్ర‌ధాన పోటీదారుడిగా మారాడు. మెగా టోర్నీల్లో వాళ్ల‌ను ఫైన‌ల్లో ఓడించి కొత్త చాంపియ‌న్‌గా అవ‌త‌రించాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు