Friday, October 11, 2024
spot_img

నావల్ డాక్‌యార్డులో అప్రెంటిస్‌ పోస్టులు..

తప్పక చదవండి

ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రోప్లేటర్, ఫౌండ్రీ మ్యాన్, మెకానిక్ (డీజిల్), ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఎంఎంటీఎం, మెషినిస్ట్, పెయింటర్, ప్యాటర్న్ మేకర్, మెకానిక్ ఆర్‌&ఏసీ, షీట్ మెటల్ వర్కర్ తదితర విభాగాల‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ముంబయిలోని భారత రక్షణ మంత్రిత్వ శాఖ‌ (నేవీ), నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ ప్రకటన ద్వారా 281 ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్ బ‌ట్టి ఇంట‌ర్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జూలై 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ కాలం ఒక యేడాది పాటు ఉంటుంది.

మొత్తం పోస్టులు : 281.. పోస్టులు : ట్రేడ్‌ అప్రెంటిస్‌. విభాగాలు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రోప్లేటర్, ఫౌండ్రీ మ్యాన్, మెకానిక్ (డీజిల్), ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఎంఎంటీఎం, మెషినిస్ట్, పెయింటర్, ప్యాటర్న్ మేకర్, మెకానిక్ ఆర్‌&ఏసీ త‌దిత‌రాలు. అర్హతలు : 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్ బ‌ట్టి ఇంట‌ర్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు: 14-21 ఏండ్ల మ‌ధ్య‌ ఉండాలి. దరఖాస్తు : ఆన్‌లైన్‌లో.. ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా.. చివరి తేది: జూలై 25.. వెబ్‌సైట్‌: https://indiannavy.nic.in/

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు