Friday, April 26, 2024

ఆలయ పుష్కరణిలో ఈవో స్విమ్మింగ్

తప్పక చదవండి
  • నిజామాబాద్ నీలకంఠేశ్వరాలయంలో అపచారం..
  • స్వామి వారికి అర్చకులు అభిషేకం చేస్తుంటే.. పక్కనే జలకాలాడిన ఈవో వేణు
  • పూజారులు చెప్పినా, భక్తులు వారించినా పట్టించుకోని వైనం
  • అపచారం చేసిన ఈవో చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్

నిజామాబాద్ : నిజామాబాద్ లోని నీలకంఠేశ్వర ఆలయం.. దక్షిణ కాశీగా పేరు పొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అలాంటి గుడికి ఈవోగా ఉన్న వ్యక్తి విచిత్ర చేష్టలకు దిగారు. నీలకంఠేశ్వర స్వామి విగ్రహాలకు ఆలయ అర్చకులు పుష్కరిణిలో ప్రత్యేక అభిషేకం చేస్తుండగా.. ఆ పక్కనే వేణు ఈత కొడుతూ జలకాలాడారు. దక్షిణ కాశీగా నీల కంటేశ్వర ఆలయం ప్రసిద్ధి ఉంది.. అలాంటి పుష్కరణిలో, అది కూడా దేవుని విగ్రహాలకు అభిషేకం నిర్వహిస్తుండగా ఇలా చేయడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పుష్కరిణిలో ఈత కొట్టద్దు అంటూ అర్చకులు వారిస్తున్నా ఈవో వేణు ఈత కొట్టినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈవో వేణు వీడియో వైరల్ కావడంతో.. ఈ వ్యవహారం బయటపడింది. వేణు మొత్తం నాలుగు ఆలయాలకు ఇంఛార్జ్ ఈవోగా ఉన్నారు.. అలాంటి బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న అధికారి ఇలా పుష్కరణిలో దేవునికి అభిషేకం చేసే సమయంలో ఈత కొట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నీలకంఠేశ్వర ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది.. ఆలయం నీలకంఠేశ్వర రూపంలో శివునికి అంకితం చేశారు. ఈ ఆలయం 15వ శతాబ్దంలో కాకతీయ రాజవంశం నిర్మించబడింది.. ఈ ప్రాంతంలోని పురాతన దేవాలయాలలో ఒకటిగా పరిగణిస్తారు స్థానికులు. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది.. ఈ ఆలయం 2000లో పునర్నిర్మాణం చేశారు. ఈ ఆలయంలో శివుడు నీలకంఠేశ్వర రూపంలో పూజించబడతాడు. ఆలయ సముదాయంలో చాలా మండపాలు కూడా ఉన్నాయి. మండపాలు కూడా హిందూ పురాణాలలోని దృశ్యాలను వర్ణించేలా శిల్పాలు, శిల్పాలతో అలంకరించి ఉన్నాయి. ఆలయ సముదాయం చుట్టూ పెద్ద గోడ కూడా ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు